Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి చిన్నారులను మెగా ఫ్యాన్స్ గా మార్చేసిన ‘పసివాడి ప్రాణం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాల్లో చిరంజీవి శకం మొదలైన తర్వాత వచ్చిన మార్పులు అనేకం. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, మాస్, బాక్సాఫీసు లెక్కలు, సినిమా రన్.. ఇలా చాలా మారాయి. ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పినట్టు.. ఇతర హీరోలందరూ చిరంజీవిలా చేయకపోతే కష్టం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా యువత, ప్రేక్షకులను మెప్పించడంలో కొత్త పద్ధతులు తీసుకొచ్చారు. ఈకోవలోనే చిన్నపిల్లలనూ ఆకట్టుకున్నారు. అలా చిరంజీవికి చిన్నారుల్లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ‘పసివాడి ప్రాణం’. ఈ సినిమా తర్వాత చిన్నారులు చిరంజీవిని అభిమానులై తర్వాతి రోజుల్లో వారే మెగా ఫ్యాన్స్ గా మారిపోయారు. పసివాడి ప్రాణం సృష్టించిన ప్రభంజనానికి బాక్సాఫీసు సరికొత్త లెక్కలు లిఖించుకుంది. అంతటి మెగా హిట్ అయింది.

చిన్నారులే మెగా ఫ్యాన్స్..

మాస్ హీరోగా చిరంజీవి చరిష్మా, డ్యాన్స్ స్కిల్స్ ను సినిమాలో పూర్తిగా ఆవిష్కరించారు. ఫైట్లు, డ్యాన్సులు, స్టైల్, మాస్.. అన్ని అంశాలను చిరంజీవికి తగ్గట్టు మార్చారు. ప్రేమించి పెళ్లాడిన అమ్మాయి దూరమై మందుకు బానిసైన మధు పాత్రలో చిరంజీవి కనిపిస్తారు. పుట్టుకతో మూగ, చెవుడు ఉన్న మూడేళ్ల పాపను అక్కరకు చేర్చుకుని.. విలన్ల బారి నుంచి కాపాడటమే సినిమా కథ. ప్రతి సన్నివేశంలో చిరంజీవి పండించిన కామెడీ, స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మాసివ్ స్టైల్లో రాసుకున్న డైలాగులకు చిరంజీవి తన మార్కు డైలాగ్ డెలివరీతో చక్కిలిగింతలు పెట్టిస్తారు. చిన్నారి పాత్రలో సుజిత నటించింది. చిన్నారితో చిరంజీవి సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించాయి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి చిన్నారులను మెగా ఫ్యాన్స్ గా మార్చేసిన ‘పసివాడి ప్రాణం’

బ్రేక్ డ్యాన్స్ విప్లవం..

పసివాడి ప్రాణంలో చిరంజీవి చూపిన మేజర్ హైలైట్ బ్రేక్ డ్యాన్స్. అప్పటికే డ్యాన్సుల్లో పేరున్న చిరంజీవి తొలిసారి రాప్ సాంగ్ తరహాలో బ్రేక్ డ్యాన్స్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ‘చక్కని చుక్కని సందిట బ్రేక్ డ్యాన్స్..’ అనే పాట తెలుగునాట మోగిపోయింది. ఈ పాట తర్వాత తెలుగు సినిమాల్లో బ్రేక్ డాన్స్ కామన్ అయిపోయింది. ప్రతి హీరో బ్రేక్ డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అంతటి ఇంపాక్ట్ చూపించారు చిరంజీవి. చిరంజీవి-విజయశాంతి మధ్య కెమిస్ట్రీ.. కామెడీ సన్నివేశాలు, డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చక్రవర్తి చేసిన మాయాజాలం మరోసారి సినిమాకు మేజర్ హైలైట్ అయింది. పాటలన్నీ చార్ట్ బస్టర్లే. బ్రేక్ డ్యాన్స్ పాట ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కు పండుగ.

రికార్డులకు నాంది..

గీతా ఆర్ట్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాణంలో ఎ.కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. 1987 జూలై 23న విడుదలైన పసివాడి ప్రాణం 38 కేంద్రాల్లో 100 రోజులు.. తిరుపతిలో రోజుకు 5 ఆటలతో 175 రోజులు.. నెల్లూరు, అనంతపురంలో 5 ఆటలతో 100 రోజులు ఆడింది. చిరంజీవికి ఇదే తొలి సిల్వర్ జూబ్లీ సినిమా. కలెక్షన్ల పరంగా 5కోట్లు దాటిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. 100 రోజుల వేడుకను తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. చిరంజీవికి ఇదే తొలి పబ్లిక్ ఫంక్షన్. రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి దక్షిణాది సినిమాగా నిలిచింది. 1988లో రష్యాలో జరిగిన ప్రపంచ చలన చిత్ర మహోత్సవాల్లో పసివాడి ప్రాణం ప్రదర్శించారు. ఈ సినిమా నుంచి వరుసగా ఆరేళ్లపాటు చిరంజీవి ప్రతి ఏటా ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...