Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 25 జనవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా‌.5:48
తిథి: పుష్య బహుళ అష్టమి రా.తె.3:14 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము : చిత్త ఉ.8:29 వరకు తదుపరి స్వాతి
కరణం: బాలవ సా.5:43 వరకు
యోగం: ధృతి ఉ.7:18 వరకు తదుపరి శూల
వర్జ్యం: మ.1:49 నుండి 3:21 వరకు
దుర్ముహూర్తం.ఉ.8:51 నుండి 9:35 వరకు తదుపరి రా.10:53 నుండి 11:37 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి సా.4:30 వరకు
యమగండం:ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం :మ.12:28నుండి 1:52 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి ఉ .6:05 వరకు
అమృతఘడియలు: ‌రా.10:59 నుండి 12:31 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:50

ఈరోజు (25-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

వృషభం: బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

సింహం: ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

తుల: చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి

వృశ్చికం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనస్సు: అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మకరం: ముఖ్యమైన పనులు మందగిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఇంటా బయట కొందరి మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1 COMMENT

  1. 132460 132823Spot lets start function on this write-up, I actually believe this remarkable internet site requirements additional consideration. Ill a lot more likely be once once again you just read additional, thank you that data. 789182

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...