Switch to English

ఇన్‌సైడ్ స్టోరీ: ఆ బూతులంటే మీడియాకి ఎంత ఇష్టమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఆయనో బూతులు మంత్రి. నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకేమీ రావు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపైనా, ఆయన తనయుడు నారా లోకేష్ మీదా బూతులతో విరుచుకుపడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీలో చాలామంది నేతలది ఇదే తీరు అయినా, ఆ మంత్రిగారి తీరు మరీ మరీ ప్రత్యేకం. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన మంత్రి ఆయన. కేవలం బూతులు తిట్టేందుకే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి. ఆయనెవరో కాదు మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని.

సరే, టీడీపీ నేతలు బూతులు మాట్లాడటంలేదా.? అంటే, అది వేరే చర్చ. అధికారంలో వున్నోళ్ళకి సంయమనం వుండాలి.. అంతకు మించిన బాధ్యతతో వ్యవహరించాలి. సభ్య సమాజం తమ గురించి ఏమనుకుంటుందోనన్న కనీసపాటి ‘సోయ’ వుండాలి. అడ్డగోలు బూతులు, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు. చీటికీ మాటికీ మీడియా కెమెరాలు, మైకులు ఆయన వద్దకు పరుగులు పెట్టేది, ఆయన తిట్టే తిట్ల కోసమే. అవి మీడియా ప్రతినిథులకు మరీ అంత వినసొంపుగా వుంటాయా.? ఏమో మరి, సోకాల్డ్ మీడియా ప్రతినిథులకే తెలియాలి.

జర్నలిజం అంటే అర్థమే మారిపోయింది. బూతు ఎక్కడుందో అక్కడికే జర్నలిజం పరుగులు.. అన్నట్టు మారిపోయింది పరిస్థితి. ఒకప్పుడు అభ్యంతరకర పదాల విషయంలో ‘బీప్’ వుండేది. సోషల్ మీడియా నుంచి పోటీ తట్టుకోవడం కోసం తెలుగు మీడియా ‘బీప్’ని దాదాపు మర్చిపోయింది. ఎవరన్నా బూతులు తిడితే, వాటిని యధాతథంగా ప్రసారం చేసేస్తున్నాయి. ఇంకేముంది, రాజకీయ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు.. తమ బూతులు ట్రెండింగ్‌లోకి వస్తుండడంతో.

చిత్రమేంటంటే మహిళా జర్నలిస్టుల్ని ఈ బూతు నేతల దగ్గరకు పంపి ఇంటర్వ్యులు చేయిస్తున్నాయి ఆయా మీడియా సంస్థలు. అయినాగానీ, నాయకులు తమ బూతులు మానడంలేదు. నేతలు మారడంలేదు కాబట్టి, కనీసం మహిళా జర్నలిస్టుల్ని అలాంటి ఇంటర్వ్యులకూ దూరంగా వుంచుతున్నారా.? అంటే అదీ లేదాయె.

నాయకుల బూతులే, వారికి రాజకీయ భవిష్యత్తునిస్తాయ్.. అనే వాదన క్రమంగా బలపడిపోతోంది. అందుకే, ఒకర్ని మించి ఇంకొకరు బూతులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతకర వార్తలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, మీడియాలో నిత్యం కనిపిస్తున్న బూతులపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...