Switch to English

క్రిస్టియన్ స్కూల్స్ ఏటా 2500 కోట్లు ఆదా చేసుకుంటున్నాయి..!: ఎన్‌సీపీసీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

విద్యా హక్కు చట్టం పరిధిలో క్రైస్తవ పాఠశాలలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 13 వేల క్రైస్తవ పాఠశాలలు ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఆదా చేసుకుంటున్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) పేర్కొంది. ఈక్రమంలో క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎన్‌సీపీసీఆర్ ప్రయత్నిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం.. అన్ని అన్-ఎయిడెడ్  పాఠశాలలు కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ప్రవేశం కల్పించాలని చెప్తోంది.

 

మైనారిటీ ఎడ్యుకేషన్‌పై ఎన్‌సీపీసీఆర్ చేపట్టిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 2017-18లో ప్రైవేటు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సాధారణ కోర్సులు అభ్యసించేందుకు ఒక్కో విద్యార్థి చేసిన ఖర్చు రూ.18,267 అని ఎన్‌సీపీసీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఎన్‌సీపీసీఆర్ తెలిపిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 13 వేల క్రైస్తవ మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయని తేలింది. ఇప్పుడీ చట్టం పరిధిలోకి మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్స్‌ను తీసుకురావాలని ఎన్‌సీపీసీఆర్ ప్రయత్నిస్తోంది.

 

ఈ స్కూల్స్ లో ప్రస్తుతం 54,86,884 మంది చదువుతున్నారని.. వీరి నుంచి ఏడాదికి రూ.10,022.89 కోట్లు వసూలు చేస్తున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి మైనారిటీ పాఠశాలలు రాకపోవడం వల్ల.. సమాజంలో అణగారిన, బలహీన వర్గాలవారి పిల్లలకు క్రైస్తవ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం లేదు. ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారిలో 74.01 శాతం (కొన్ని రాష్ట్రాల్లో 80 శాతం) మంది నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారేనని ఎన్‌సీపీసీఆర్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

దీనిపై ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు క్రైస్తవ సంస్థల పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా విద్యా హక్కు చట్టాల్లో మార్పులు చేయాలి. మైనారిటీ స్కూల్స్‌గా చెప్పుకుంటూ.. నాన్ క్రిస్టియన్ కేటగిరీల్లోని ఉన్నత వర్గాలవారి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి’ అని అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...