Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 13 ఆగస్ట్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:27
తిథి: శ్రావణ శుద్ధ పంచమి మ.2:08 వరకు తదుపరి షష్ఠి
సంస్కృతవారం: బృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: హస్త ఉ.9:24 వరకు తదుపరి చిత్త
యోగం: సాధ్యం మ.3:59 వరకు తదుపరి శుభం
కరణం: భాలవ మ.2:08 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: సా.5:00 నుండి 6:31 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:17 నుండి 9:07 వరకు తదుపరి మ.12:29 నుండి 1:19 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం: ఉ.7:36 నుండి 9:11 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:26 నుండి తె.5:14 వరకు
అమృతఘడియలు: రా.2:07 నుండి 3:38 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ11:55 నుండి 12:46 వరకు.

ఈరోజు (13-08-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం: కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో అలోచించి ముందుకు సాగాలి.

మిథునం: అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం: వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి.

కన్య: కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు.

తుల: గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు . ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం: నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మీనం: వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...