Switch to English

చేయని నేరానికి 25 ఏళ్లు జైలులో..

వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు.. కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన న్యాయసూత్రం. సాధారణంగా ఎక్కడైనా ఇదే కరెక్ట్. కానీ అమెరికాలో మాత్రం ఓ యువకుడు చేయని నేరానికి ఏకంగా 25 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. చివరకు అసలు విషయం తెలియడంతో సగానికి పైగా జీవితం అయిన తర్వాత బయటకు వచ్చాడు. 1996 జూన్ 13న అమెరికాలోని ఇదాహో పట్టణంలో 18 ఏళ్ల అంజీ డాడ్జ్ అనే యువతిని ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె తల, మొండెం వేరుచేశారు. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. అనంతరం అంజీ స్నేహితుడు క్రిస్టోఫర్ ఓ అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దీంతో పోలీసులు అంజీని కూడా అతడే హతమార్చాడని అంచనాకు వచ్చారు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని చెప్పారు.

అప్పటికే భయపడి ఉన్న క్రిస్టోఫర్ నేరం ఒప్పుకున్నాడు. డీఎన్ఏ మ్యాచ్ కాకపోయినా.. నేరం అంగీకరించడంతో కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. అయితే, అంజీ తల్లి మాత్రం అసలు నేరస్తుడు క్రిస్టోఫర్ కాదని బలంగా నమ్మింది. దీంతో ఆమె 2014లో ఇన్నొసెన్స్ ప్రతినిధులతో కలిసి కేసును రీఓపెన్ చేయించింది. క్రైం సీన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ప్రొఫైల్ సిద్ధం చేశారు. అనంతరం అంజీకి తెలిసినవారు, అనుమానం ఉన్నవారి డీఎన్ఏతో పోల్చి చూడాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అంజీ ఇంటి ఎదురుగా ఉన్న బ్రయాన్ లీఫ్ డ్రిప్స్ డీఎన్ఏతో మ్యాచ్ అయింది. విచారణలో నేరం అంగీకరించడంతో క్రిస్టోఫర్ విడుదలయ్యాడు.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్.. తుది జట్టును ప్రకటించిన భారత్

మరికొన్ని గంటల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. భారత్-కివీస్ మధ్య వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సారథ్యంలో...

శంకర్‌ ను వదలనంటున్న లైకా.. ఈసారి తెలంగాణలో

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయలేదు. దాంతో ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ సినిమా పూర్తి చేసే...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

వాహనదారులకు కేంద్రం శుభవార్త..! నిబంధనల్లో సవరణలు..

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో వాహనదారులకు శుభవార్త అందింది. జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఫీట్ నెస్, పర్మిట్ వంటి డాక్యుమెంట్ల...

రిపోర్టర్ పై బైడెన్ సీరియస్

విలేకరులపై విరుచుకుపడటంలో డోనాల్డ్ ట్రంప్ ను మించిన అమెరికా అధ్యక్షులు ఎవరూ లేరు. తాజాగా ఆ జాబితాలో ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేరారు. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో...