Switch to English

కియా సహా అన్నీ వైసీపీ ఖాతాలోకే..

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? అన్న చందంగా ఉందని ఏపీ అధికార పార్టీ వైసీపీ తీరు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరిట జనాలకు డబ్బు పంచడం తప్ప.. అభివృద్ధి అనేదే జరగలేదనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ రెండేళ్లలో తాము 64 కంపెనీలతో రూ.30వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం వైసీపీ నేతలకే చెల్లింది.

అన్నింటి కంటే మిన్నగా అనంతరపురంలోని కియా కార్ల పరిశ్రమతోపాటు హీరో, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీలూ తమ చలవేనని చెప్పుకోవడం గమనార్హం. కియా పరిశ్రమ తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే అశోక్ లేలాండ్, హీరోకి సంబంధించి చాలావరకు పనులు టీడీపీ హయాంలోనే జరిగాయి.

కానీ ఇవన్నీ తమ ఘనతేనని, తమ హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించాయని ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి వైసీపీ సర్కారు చెబుతున్న రూ.30వేల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు రూ.21 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే.

కానీ వైసీపీ మాత్రం అంతా తమదే క్రెడిట్ అనే రీతిలో ప్రచారం చేసుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. వైసీపీ చెబుతున్న 64 కంపెనీల జాబితా, వాటి ఒప్పంద తేదీలు, అవి పనులు ప్రారంభించిన తేదీలు, ఉత్తత్తి మొదలైన తేదీలు సరిగ్గా ప్రకటిస్తే.. ఎవరి ఘనత ఎంతో తెలిసిపోతుందని అంటున్నారు.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

విజయ్ కి దిల్‌ రాజు ఇస్తున్నది ఎంతో తెలుసా?

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ను తెలుగు లోకి తీసుకు వచ్చేందుకు దిల్‌ రాజు చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. ఆయనతో వంశీ పైడిపల్లి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించబోతున్న సినిమా చకచక...

రిపోర్టర్ పై బైడెన్ సీరియస్

విలేకరులపై విరుచుకుపడటంలో డోనాల్డ్ ట్రంప్ ను మించిన అమెరికా అధ్యక్షులు ఎవరూ లేరు. తాజాగా ఆ జాబితాలో ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేరారు. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో...

విద్యార్థుల చదువులకి కరోనా కష్టాలు.. నిండా ముంచేస్తున్నదెవరు.?

కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా చదువులు చెట్టెక్కేశాయి. చదవాలా.? వద్దా.? అన్న సంశయంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది విద్యార్థులకి. రెండు విద్యా సంవత్సరాలు దారుణంగా దెబ్బతినేశాయి. పదో తరగతి ఫౌండేషన్.. ఇంటర్మీడియట్ అత్యంత కీలకం.. వాటికే...

‘హను మ్యాన్‌’ లో క్రాక్‌ లేడీ విలన్‌

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. చాలా యూనిక్ గా ఈయన సినిమా లను తెరకెక్కిస్తూ విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు....

టెన్షన్‌ పెడుతున్న మంకీపాక్స్‌.. WHO హెచ్చరిక

ఇప్పటికే కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా జనాలు అల్లాడి పోతున్నారు. ఆ విపత్తు నుండి ఎప్పటికి బయట పడతామో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ వచ్చినా కూడా భారత్‌ వంటి దేశాల్లో అదుపులోకి...