Switch to English

రామ్ చరణ్..! మెగా వారసత్వాన్ని ఘనంగా చాటిన నిశ్శబ్ధ విస్ఫోటనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఒక తరంలో ఓ వ్యక్తి సాధించిన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్థులను కాపాడటమే కాదు, తర్వాతి తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారసుడిదే. ముఖ్యంగా సినీ, రాజకీయం, పారిశ్రమిక రంగాల్లో తండ్రి కీర్తి, ప్రతిష్టలను నిలబెట్టడమే కాదు.. తనకు తానుగా తండ్రి స్థాయికి తగ్గకుండా పేరు తెచ్చుకోవడం పెను సవాలు. సినిమాల్లో దీనిని ఘనంగా చాటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. తెలుగు సినిమాను మూడున్నర దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు హీరోగా వస్తున్నాడంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉంటాయి. కారణం.. చిరంజీవి తన స్వశక్తితో సాధించుకున్న కీర్తిని రామ్ చరణ్ నిలబెట్టాల్సి రావడమే. కానీ.. రామ్ చరణ్ తండ్రి పేరునే కాదు.. సినీ ఘన వారసత్వాన్ని.. తన టాలెంట్ తో అంతే ఘనంగా చాటాడు.

ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలు నిలబెట్టి..

2007 సెప్టెంబర్ 28న చిరంజీవి తనయుడి తొలి సినిమా ‘చిరుత’ విడుదల. 27న రాష్ట్రవ్యాప్తంగా మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే ఉత్కంఠ. మరునాడు విడుదల కాబోయే సినిమాను చూడాలనే ఆతృత. రాష్ట్రంలోని చిరుత విడుదలయ్యే ప్రతి ధియేటర్ పెళ్లి మండపాల్లా ముస్తాబైపోయాయి. చిరుత చూపులతో రామ్ చరణ్ పోస్టర్లలో మెరిసిపోతున్నాడు. అనేక ఉత్కంఠల మధ్య, మెగాభిమానుల ఒత్తిడి మధ్య దాదాపు రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో 27 రాత్రి 10గంటల నుంచే షోలు వేయడం ప్రారంభించారు.

రామ్ చరణ్..! మెగా వారసత్వాన్ని ఘనంగా చాటిన నిశ్శబ్ధ విస్ఫోటనం

రామ్ చరణ్ తెరపై ఏం చేస్తాడో.. ఎలా నటిస్తాడో.. డ్యాన్స్. ఫైట్స్ ఎలా చేస్తాడో అనే అనుమానాలన్నింటికీ ధియేటర్లలో హోరు సమాధానం ఇచ్చేసింది. ఫస్ట్ ఫైట్, పాటతోనే మెగా వారసుడు అనిపించుకున్నాడు. చిరంజీవి మార్క్ తగ్గలేదని అభిమానులు పులకరించిపోయారు. తొలి సినిమాలోనే డ్యాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో ఈజ్ తోపాటు నటనతో మెప్పించి అభిమానులు, విమర్శకులతో స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు.

మెగా వారసత్వాన్ని అంతే ఘనంగా..

ముందురోజే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో 28 నుంచి ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. పూరి జగన్నాధ్ మార్క్ టేకింగ్, మణిశర్మ మ్యూజిక్ హెల్ప్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ పేరు మోగిపోయింది. డెబ్యూ హీరోగా రామ్ చరణ్ తెచ్చుకున్న ఓపెనింగ్స్, కలెక్షన్లు.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా వచ్చే వరకూ.. దాదాపు 14ఏళ్లు ఉండటం విశేషం. సినీ పెద్దలకు ప్రసాద్ ఐమాక్స్ లో 27నే ప్రత్యేక షో ఏర్పాటు చేశారు చిరంజీవి. రజినీకాంత్ చెన్నైలో సినిమా చూశారు. ఫ్యాన్స్, సెలబ్రిటీల నోట.. ‘చరణ్.. చిరంజీవి పేరు నిలబెట్టాడు తండ్రికి తగ్గ తనయుడు’ అనే మాటే. తొలి సినిమాలోనే చరణ్ చూపిన ఫిజిక్, గ్రేస్ అద్భుతం. దీంతో ఘనమైన మెగా వారసత్వాన్ని అంతే ఘనంగా చాటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...