Switch to English

వైసీపీతో గల్లీ ఫైట్‌: ఢిల్లీ బీజేపీ ఏమంటోందంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ శాఖలో ఒకటి కాదు రెండు కాదు.. చాలా గ్రూపులున్నాయి. అందులో ముఖ్యమైనవి వైఎస్సార్సీపీ అనుకూలమైన గ్రూపు.. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన గ్రూపు. ఇంతకీ, నిఖార్సయిన బీజేపీ వాదుల గ్రూపు సంగతేంటి.? నిజానికి అదెప్పుడో ‘పలచన’ అయిపోయింది. కొద్దోగొప్పో జనసేన గ్రూపు ఒకటి, నిఖార్సయిన బీజేపీ గ్రూపు కంటే కాస్త ‘పవర్‌’ కలిగి వుందేమో.!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకూ మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం విదితమే. ఏపీ బీజేపీలో కొందరు కన్నా లక్ష్మినారాయణకు మద్దతు పలికారు. ఇంతలోనే బీజేపీలోని వైసీపీ గ్రూపు.. ఢిల్లీ పెద్దల వద్ద తన ‘బలం’ చూపిందట. దాంతో, ‘ఈ సమయంలో ఈ తరహా విమర్శలు చేయడం అనవసరం.. రాజకీయ విమర్శలకు తగిన సందర్భం కాదిది.. కేంద్ర బీజేపీదీ, రాష్ట్ర బీజేపీదీ ఒకే మాట అయి వుండాలి..’ అంటూ బీజేపీ అధిష్టానం, ఏపీ బీజేపీ నేతలకు క్లాస్‌ పీకిందన్నది ఓ వాదన.

అయితే, కన్నా లక్ష్మినారాయణకు కేంద్ర నాయకత్వం సంఘీభావం పలికిందనీ, రాష్ట్ర బీజేపీ అంతా ఒక్కతాటిపై నిలిచి, వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కొనాల్సిందిగా అధిష్టానం సూచించిందనేది ఇంకో వాదన. నిజానికి, చాలా విషయాల్లో బీజేపీలోనే రెండు మూడు ‘భిన్నాభిప్రాయాలు’ కన్పిస్తుంటాయి. రాజధాని అమరావతి విషయంలో కావొచ్చు, శాసన మండలి రద్దు విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.. ఏపీ బీజేపీకి ఒక విధానమంటూ లేకుండా పోయింది.

ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే, బీజేపీ తనతోపాటు మిత్రపక్షం జనసేననూ గందరగోళంలోకి నెట్టేస్తోంది. వైసీపీ – బీజేపీ మధ్య పోరులో, బీజేపీకి జనసేనాని మద్దతిస్తే.. దాన్ని బీజేపీలోనే కొందరు అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తుండడం గమనార్హం. అమరావతి విషయంలోనూ జనసేన వాయిస్‌ని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించిన విషయం విదితమే. ఇలాగైతే, 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు మించి బీజేపీ ఏపీలో ఎదిగే అవకాశమే వుండదన్నది నిర్వివాదాంశం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...