Switch to English

తప్పు చంద్రబాబుది.. గొప్ప వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.!

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అనూహ్యమైన నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ‘అందర్నీ ఆదుకుంటాం..’ అని చెబుతోంది ప్రభుత్వం. ‘ఎవర్నీ ఆదుకోవడంలేదు’ అంటున్నాయి విపక్షాలు. బాధితులేమో, ఓట్లడుక్కోవడం కోసం గల్లీ గల్లీకి గతంలో వచ్చిన అధికార పార్టీ నాయకులు, ఇప్పుడు తమను ఆదుకోవట్లేదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

సరే, ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలుగుతాయి.? అన్నది వేరే వాదన. కానీ, ముందస్తు హెచ్చరికల్ని ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్లే ఈ దుస్థితి అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న విమర్శ. ‘అన్నమయ్య’ ప్రాజెక్టు డ్యామ్ గేట్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

డ్యామ్ గేట్లు సరిగ్గా పని చేయకపోవడంతో, సకాలంలో వాటిని పైకెత్తలేకపోయారనీ.. దాంతో, మొత్తంగా డ్యామ్ కొట్టుకుపోయిందనీ స్వయంగా కేంద్రం, పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. డ్యామ్ నిర్వహణ విషయంలో దీన్నొక కేస్ స్టడీలా తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని కేంద్రమే చెబుతోంది.

ఈ విషయమై అధికార వైసీపీకీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ షురూ అయ్యింది. 2017లో గేట్లు బాగు చేయాల్సి వుందనీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చావు కబురు చల్లగా చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పని ఎందుకు చేయలేకపోయారన్న ప్రవ్నకు మంత్రి అనిల్ వద్ద సమాధానం దొరకదు.

అన్నట్టు, కొద్ది రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన గేటు ఒకటి కొట్టుకుపోయింది. నిజానికి, అప్పట్లోనే చాలా పెద్ద రాజకీయ రచ్చ జరిగింది. అదృష్టవశాత్తూ గేటు కొట్టుకుపోవడంతో ప్రమాదం ఆగిపోయింది. అదే డ్యామ్ కొట్టుకుపోయి వుండి వుంటే.? ఆ నష్టం అంచనాలకు అందేది కాదు.

ఏదన్నా ఘనత వుంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖాతాలో వేసెయ్యడం, తప్పు జరిగితే చంద్రబాబు ఖాతాలో వేసెయ్యడం వైసీపీ నేతలకి, మరీ ముఖ్యంగా మంత్రులకి అలవాటైపోయింది. అంతే తప్ప, జరిగిన ఘటనకి ప్రభుత్వ పెద్దలుగా బాధ్యత వహించడం అనేది ఏనాడో మర్చిపోయారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవికి మరో సెంటిమెంట్ హిట్ మూవీ… హిట్లర్

అయిదు ఫైట్లు, ఆరు పాటలు.. ప్రేక్షకులకు అదే చిరంజీవి సినిమా. కామెడీ, ఫైట్లు, డ్యాన్సులతో తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన ముద్ర అలాంటిది. కథ ఉన్నా...

వరుణ్ తేజ్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారా?

ఈ ఏడాది గని చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు వరుణ్ తేజ్. అయితే మరో రెండు నెలల్లోనే ఎఫ్ 3 కామెడీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టి...

రవితేజ ధమాకా నుండి జింతాక్ అప్డేట్!!

వరస ప్లాపులతో మాస్ మహారాజా రవితేజ డౌన్ అయిన విషయం తెల్సిందే. రీసెంట్ గా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే...

ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ విషయంలో కీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 30వ ప్రాజెక్ట్ లో నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని...

జబర్దస్త్ లో బాడీ షేమింగ్, డబల్ మీనింగ్ జోక్ ల స్పందించిన...

జబర్దస్త్... కొన్ని వారాల కామెడీ షో గా మొదలైన ఈ కార్యక్రమం 9 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఈ షో లో ఎంతో మంది వచ్చారు,...

రాజకీయం

ఫాఫం వైసీపీ.! 175 సీట్లలో జనసేన పోటీ చేస్తే వాళ్ళకి ‘హార్ట్ ఎటాక్’ వచ్చేస్తుందేమో.!

ఐటీ శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమొక్కటే ఆయన బాధ్యత.. అన్నట్లు మారింది. నీటి పారుదల శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత మీద విరుచుకుపడేందుకు...

15 శాతానికి పెరిగిన జనసేన ఓటు బ్యాంకు: ఉండవల్లి అరుణ్ కుమార్

జనసేన పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించీ, ఆయా పార్టీలకు పెరిగిన అలాగే తగ్గిన ఓటు బ్యాంకు...

పవన్ కళ్యాణ్‌కి స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది.?

మంత్రి గుడివాడ అమర్నాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు. ‘టీడీపీ నుంచి జనసేనకు.. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్‌కీ ఎప్పుడు స్వాతంత్ర్యం లభిస్తుంది.?’ అన్నది మంత్రి గుడివాడ...

జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రెయిట్ క్వశ్చన్: జగన్ సమాధానం చెప్పగలరా.?

‘కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా టీడీపీకి అమ్మేస్తారు..’ అంటూ ఇటీవలే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కాపు నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం...

పదవి మనల్ని వెతుక్కుంటూ రావాలి.. మనం ఆరాట పడకూడదు: పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పెద్ద ఎత్తున తీసుకొచ్చి.. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

ఎక్కువ చదివినవి

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

వరుణ్ తేజ్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారా?

ఈ ఏడాది గని చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు వరుణ్ తేజ్. అయితే మరో రెండు నెలల్లోనే ఎఫ్ 3 కామెడీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక రీసెంట్...

తిరుమలలో భక్తుల రద్దీ.. 6కి.మీ మేర క్యూలైన్లు.. దర్శనానికి 2రోజుల సమయం

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతోంది. 6కి.మీ మేర క్యూలైన్లు ఉన్నాయి. ప్రస్తుతం క్యూలైన్ రింగ్ రోడ్డు దాటింది. శ్రీవారి దర్శనానికి...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

డీజే టిల్లు2లో ఈ మల్లు బ్యూటీ?

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ...