Switch to English

స్కైల్యాబ్ మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

Movie స్కైల్యాబ్
Star Cast సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ,
Director విశ్వక్ ఖండేరావు
Producer నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు
Music ప్రశాంత్ విహారి
Run Time 2 hr 28 Mins
Release డిసెంబర్ 04, 2021

నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ స్కైల్యాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రాన్ని విశ్వక్ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్ర రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కథ:

1970లలో సెట్ అయిన కథ ఇది. కరీంనగర్ లోని బండలింగంపల్లి అనే మారుమూల ప్రాంతంలో స్కైల్యాబ్ క్రాష్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో అంతటా గందరగోళం నెలకొంటుంది. అసలు ఈ స్కైల్యాబ్ ఏంటి? ఎక్కడి నుండి వస్తోంది? లైసెన్స్ క్యాన్సిల్ అయిన డాక్టర్ (సత్యదేవ్), సుబేదారి రామారావు (రాహుల్ రామకృష్ణ), విఫలమైన జర్నలిస్ట్ గౌరి (నిత్యా మీనన్) ఆ ఊరి ప్రజల భయాలను ఎలా క్యాష్ చేసుకుని తమ జీవితంలో సమస్యలను అధిగమించారన్నది ఈ చిత్ర ప్రధాన పాయింట్.

నటీనటులు:

నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. నిత్యా మీనన్ జర్నలిస్ట్ పాత్రలో రాణించింది. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కూడా తమ పాత్రలను పెర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి చిన్న పాత్ర అయినా కూడా మెప్పిస్తారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ మెప్పిస్తుంది. అలాగే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ లో ఊరి ప్రజల కోరికలు మంచి ఎమోషనల్ కనెక్టివిటీని ప్రెజంట్ చేస్తుంది.

సాంకేతిక నిపుణులు:

1976లో నిజంగా జరిగిన స్కైల్యాబ్ కథను కోర్ పాయింట్ గా తీసుకుని ఈ స్క్రిప్ట్ ను రాసిన దర్శకుడు విశ్వక్ ఖండేరావును అభినందించాలి. ఇక పల్లెటూరి సెటప్, పరిస్థితులు అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా కుదిరాయి కాకపోతే స్క్రీన్ ప్లే బాగా నెమ్మదించిన ఫీల్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే ను కొంత వేగవంతం చేసి ఉంటే సినిమా ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది.

ప్రశాంత్ విహారి సంగీతం చిత్రానికి చక్కగా సెట్ అయింది. సౌండింగ్ లో ఫ్రెష్ ఫీల్ ఉంది. ఆదిత్య అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా లైటింగ్. నిత్యా మీనన్, పృథ్వీ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే డిజైన్, ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • ఆర్ట్ వర్క్
  • ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్

నెగటివ్ పాయింట్స్:

  • స్లో నరేషన్
  • కమర్షియల్ అంశాలు లేకపోవడం

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే స్కైల్యాబ్ మంచి సెటప్, ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ లు ఉన్నా కానీ స్లో పేస్ దెబ్బతీస్తుంది. అయితే మరోవైపు, కమర్షియల్ అంశాలు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్ అవ్వడం కష్టమే. పెద్దగా అంచనాలు లేకుండా ఈ చిత్రాన్ని చూడవచ్చు లేదా ఓటిటిలో వచ్చే వరకూ వేచి ఉంటే ఇంకా ఉత్తమం.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా...

రాజకీయం

కొడాలి నాని, వంగవీటి రాధాలక కరోనా పాజిటివ్

దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన...

ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి....

చంద్రబాబు వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన

ఇతర పార్టీలతో పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ కార్య నిర్వాహక సభ్యులతో పవన్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటివల చంద్రబాబు చేసిన వన్...

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

ఎక్కువ చదివినవి

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. రాధే శ్యామ్ రిలీజ్...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణ రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే.. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని.. వారికి తాను వారం సమయం ఇస్తున్నానని.. వారి...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోవడం, థియేటర్స్ లో మళ్ళీ నిబంధనలు...