Switch to English

YSRCP: వైసీపీ కాపు నేతలకు తగులుతున్న ‘సెగ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ‘కాపు’ నాయకులకు, సొంత సామాజిక వర్గం నుంచి సెగ తగులుతోంది. ఆయా నియోజక వర్గాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి.

‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ కాపు సామాజిక వర్గంలో, ‘అధికార పీఠంపైన’ ఆలోచన క్రమక్రమంగా బలపడుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి గతంలో చిరంజీవి, రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే, కొందరు కాపు నేతలే తొక్కేశారన్న వాదన వుంది. ఇప్పుడు ఇంకోసారి అలాంటి ప్రయత్నం జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతోందన్నది కాపు సామాజిక వర్గ పెద్దల ఆవేదన.

వంగవీటి రంగా విషయంలో కూడా కాపు నాయకులే, అర్థం పర్థం లేని రాజకీయాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం కొత్తేమీ కాదు. గతంలో పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. మొన్నటికి మొన్న వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని తూలనాడారు కాపు నేత ముద్రగడ పద్మనాభం.. తన లేఖల ద్వారా. దాంతో, ముద్రగడకు సొంత సామాజిక వర్గం నుంచి సెగ తప్పలేదు.

తాజాగా, మంత్రి బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనకు వెళితే, అక్కడా ఆయనకు కాపు సామాజిక వర్గం నుంచి సెగ తగిలింది. జనసేనకు అనుకూలంగా నినాదాలు చేసిన కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు, ‘కాపు ద్రోహి’ అంటూ బొత్సపై మండిపడ్డారు. దాంతో, అప్పటికి ఆ కార్యక్రమం నుంచి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయారు. ఈ ఘటనపై బొత్స డిఫెన్స్‌లో పడినట్లు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గం నుంచి తగులుతున్న సెగ నేపథ్యంలోనే, మాజీ మంత్రి పేర్ని నాని, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలనుకుంటున్నారన్నది ఓ వాదన. గుడివాడ అమర్నాథ్ కావొచ్చు, అవంతి శ్రీనివాస్ కావొచ్చు, అంబటి రాంబాబు కావొచ్చు.. కన్నబాబు కావొచ్చు.. ఇలా చాలామంది వైసీపీ కాపు నేతలకు కాపు సామాజిక వర్గం నుంచే సెగ గట్టిగా తగులుతోంది.

రానున్న రోజుల్లో ఈ సెగ మరింత తీవ్రతరం కాబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోపక్క, అధినేత ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ మీద అర్థం పర్థం లేని విమర్శలు చేయక తప్పడంలేదని కొందరు వైసీపీ కాపు నేతలు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం… పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటన

ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంచేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక...

పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం, క్షమాపణలు కోరుతూ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

మెగా–వెంకీ మ్యాజిక్: మన శంకరవరప్రసాద్ గారు సెట్స్‌పై భావోద్వేగ క్షణాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ఒక హైలైట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను...

ఎట్టకేలకు.. రెండవ వివాహం చేసుకున్న సమంత!

దీర్ఘకాలంగా ఊహాగానాల మధ్య ఉన్న నటీమణి సమంత రూత్ ప్రభు  చివరకు తన రెండవ వివాహం పూర్తి చేసుకున్నారు. దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగ...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...