పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణం
సూర్యోదయం: ఉ.5:50
సూర్యాస్తమయం: రా.6:07 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ నవమి రా.8:12 ని.వరకు తదుపరి శ్రావణ బహుళ దశమి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: మృగశిర సా.4:01 ని.వరకు తదుపరి ఆరుద్ర
యోగం: సిద్ధి రా.2:24 ని. వరకు తదుపరి వ్యతిపాత
కరణం: తైతుల ఉ.8:01 ని. వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం: ఉ.8:17 ని.నుండి 9:06 ని.వరకు తదుపరి మ.12:23 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.12:53 నుండి 2:35 వరకు
రాహుకాలం: ఉ.10:30 గం. నుండి మ.12:00 ని.వరకు
యమగండం: మ.3:00 ని నుండి సా.4:30 గం .వరకు
గుళికా కాలం: ఉ.7:38 నుండి 9:10 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 ని.నుండి 5:18 ని.వరకు
అమృతఘడియలు: ఉ.6:52 ని. నుండి 8:32 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:49 నుండి మ.12:38 వరకు
ఈరోజు (08-09-2023) రాశి ఫలితాలు
మేషం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృషభం: ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి.
మిథునం : ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.
సింహం: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని వత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చికం: సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.
ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
మకరం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ ఉన్నవి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభం: నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీనం: వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.