CBN: నారా లోకేష్ పుట్టుక గురించి వైసీపీ నేతలు చేస్తోన్న అభ్యంతరకర వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రులే, దిగజారి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కూడా, అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యల్ని వైసీపీ ప్రజా ప్రతినిథుల నుంచి చూస్తున్నాం.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అనే తరహాలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది తప్పుడు పుట్టుక.. అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విపరీత వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
చంద్రబాబు ఉద్దేశ్యం ఏదైనా, విషయం వివాదాస్పదమయ్యింది. ముఖ్యమంత్రి అనే కాదు, ఏ వ్యక్తి గురించీ ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక ‘కామన్ ప్రాక్టీస్’ అయిపోయింది. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత.. ఇలా ఎవరూ తక్కువ కాదు ఈ విషయంలో.! ఒకర్ని మించి ఇంకొకరు తమ స్థాయిని దిగజార్చుకోవడానికి మేగ్జిమమ్ ట్రై చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకుంటోన్న చంద్రబాబుకి, ‘తప్పుడు పుట్టుక’ అంటే అర్థమేంటో తెలియదా.?
‘నా భార్యను నిండు అసెంబ్లీలో అవమానించారు..’ అని మీడియా ముందర కంటతడి పెట్టుకున్న చంద్రబాబు, ఎలా అశేష ప్రజానీకం ముందర, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను అవమానించగలిగారు.?
‘వైఎస్ జగన్‌ది తప్పుుడు పుట్టుక..’ అనడమంటే, వైఎస్ విజయలక్ష్మిని అవమానించడమే కందా.? అన్న కనీస ఇంగితం చంద్రబాబులో లోపించడం దురదృష్టకరం. రాష్ట్ర రాజకీయాలు అత్యంత అసభ్యకరంగా తయారయ్యాయి. తిలా పాపం.. తలా పిడికెడు.!