Switch to English

రంగుల రాజీకీయంలోకి బీజేపీని లాగుతున్న వైసీపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఏపీలో ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులను తొలగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల్లోగా ఆ రంగులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ భవనాలకు దాదాపు రూ.1400 కోట్లు వెచ్చించి వేసిన వైసీపీ రంగులు తొలగించి కొత్త రంగులు వేయాలంటే మరో రూ.1400 కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అంత మొత్తం వెచ్చించడం తలకు మించిన భారమేనని పేర్కొంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా అధికార పార్టీ తమ పార్టీ జెండా రంగులు తీసివేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ రంగులు మార్చక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అటు కోర్టు ఆదేశాలు పాటించినట్టుగా చూపిస్తూనే.. తమ పార్టీ రంగులు తీయకుండా ఉండేలా ఉత్తర్వులు వెలువరించింది. అదనంగా మరో రెండు రంగులు వేయడం ద్వారా తమ మాట నెగ్గించుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ బిల్డింగ్ కోడ్ లో రంగులకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేవని, గ్రామీణ సంస్కృతి ఆధారంగా రంగులు ఎంచుకునే స్వేచ్ఛ తమకు ఉందని పేర్కొంది. రంగులపై నియమించిన నిపుణుల కమిటీ సూచించిన రంగులను ఈ సందర్భంగా సర్కారు వివరించింది.

వ్యవసాయానికి ప్రతీకగా ఆకుపచ్చ, ఆక్వా ఉత్పత్తులను ప్రతిబింబించేలా నీలిరంగు, పాల ఉత్పత్తులకు తెలుపు, భూమికి గుర్తుగా మట్టి రంగు వేయాలని కమిటీ సూచించినట్టు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటికి అదనంగా స్థానిక సంప్రదాయలను బట్టి మరో రంగు జోడించవచ్చని సూచించింది. మట్టి రంగు మినహా మిగిలిన మూడు రంగులూ వైసీపీ జెండా రంగులే కావడం గమనార్హం. మట్టి రంగు కాకుండా మరో రంగు జోడించాలన్న సర్కారు.. అందులోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కాషాయ రంగును వేయడం ద్వారా బీజేపీని కూడా సంతృప్తపరచవచ్చని భావిస్తోంది.

అలా చేయడం వల్ల బీజేపీ ఈ వ్యవహారంలో విమర్శలు చేసే పరిస్థితి ఉండదని యోచిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఓ పంచాయతీకి ఈ రంగులు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పద్ధతి అనుసరించనున్నారు. మొత్తానికి కోర్టు స్పష్టంచేసినా.. అధికార పార్టీ మాత్రం తాను అనుకున్నదే చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...