తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా.!
ఔను కదా.! అది నిజమే కదా.! కానీ, ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీయార్.. ఏయన్నార్.. ఈ ఇద్దరూ రెండు కళ్ళు’ అని అంటే, అది ఎంతవరకు సబబు.? తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎన్టీయార్, ఏయన్నార్ మాత్రమేనా.? తెలుగు సినిమాకి ‘తొలితరం’ అంటే ఈ ఇద్దరు మాత్రమే కాదు.!
కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఈ ‘రెండు కళ్ళ సిద్ధాంంతం’ గురించి స్పందించారు. ప్రశ్న అడిగింది కూడా మహానటి జయప్రద. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా జయప్రదకు తిరుగులేని ఫాలోయింగ్ వుండేది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఎవర్‌గ్రీన్ జయప్రద.!
ఆ జయప్రద, ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీయార్, ఏయన్నార్.. రెండు కళ్ళు కదా..’ అని అడిగారు. దానికి అక్కినేని నాగేశ్వరరావు సమాధానమేంటో తెలుసా.? ‘పత్రికలోళ్ళు పని లేక రాసే రాతలివి. మేం రెండు కళ్ళు ఏంటి.? ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, కృష్ణ, కృష్ణం రాజు, రేలంగి.. వీళ్ళంతా ఎవరు.?’ అని ప్రశ్నించారు అక్కినేని నాగేశ్వరరావు.
అంతే కాదు, ‘మేం రెండు కళ్ళు.. అని చెప్పుకోవడానికి, నమ్మేయడానికీ.. పొంగిపోవడానికి.. ఎన్టీయార్ ఏమీ పిచ్చోడు కాదు.. నేనూ పిచ్చోడ్ని కాను..’ అని అక్కినేని నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం.
ఔను, ఓ భానుమతి.. ఓ జగ్గయ్య.. ఓ కాంతారావు.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దది. తెలుగు సినిమా స్వర్గీయ ఎన్టీయార్‌తో ప్రారంభం కాలేదు, స్వర్గీయ ఏఎన్నార్‌తో ముగిసిపోలేదు. ఇదొక ప్రవాహం.. కొత్త రక్తం పోతుంది.. పాత రక్తం వస్తుంది. తెలుగు సినిమా వైభవం.. అంటే, అందులో చాలా పేర్లుంటాయ్.
ఓ రంగారావు.. ఓ తొక్కినేని.. అంటూ తేలిగ్గా మాట్లాడేసే నందమూరి బాలకృష్ణ లాంటోళ్ళూ ఈ చరిత్రలో వుంటారు.. తమ స్థాయిని దిగజార్చేసుకుంటుంటారు. అక్కినేని అంతటోడే, ‘మేం రెండు కళ్ళు కాదు..’ అన్నారంటే, ఇంకెందుకీ పిచ్చి పైత్యం. బ్లడ్డూ.. బ్రీడూ.. అంటూ పిచ్చి కూతలు. ఎస్వీయార్ గోటికి పనికొస్తాడా బాలకృష్ణ.? అంటే, ఆ పతనాన్ని బాలయ్య ఎందుకు కొనితెచ్చుకున్నట్టు.?