ఇది కదా రాజకీయం అంటే.! ముందు ముందు మీ మొహాలకి కూడా వైసీపీ నేతలు రంగులేస్తారు.! ఔను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిందే. ఇంటింటికీ జగనన్న స్టిక్కర్లు అట. ఆ తర్వాత వైసీపీ రంగులేసేస్తారు.. ప్రతి ఇంటికీ.! చివరికి మనుషులకి కూడా వైసీపీ రంగులేసేసి, ఆ రంగులతోనే బయటకు తిరగమని చెబతారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో చెట్లను కొట్టేశారు.. మిగిలిన చెట్లకు వైసీపీ రంగులసేశారు. చివరికి మొక్కజొన్న పొత్తులకి కూడా వైసీపీ రంగులేసేశారు. ఈ రాజకీయ రంగుల పైత్యాన్ని ఏమనాలి.? అంటే, అదే అర్థం కాక రాష్ట్ర ప్రజలు జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.
ఇంటి వద్దకే వైఎస్ జగనన్న బస్సులు వెళుతున్నాయ్. ఆ బస్సుల్లో జనాన్ని ఎక్కించుకుని, ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభకు తరలిస్తున్నారు వైసీపీ నేతలు. ఎంత కష్టమిది.? వైసీపీ తరఫున మాత్రమే కాదు, ప్రభుత్వం తరఫున కూడా వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు.. జనాల్ని తరలిస్తున్నారు.
‘మేం అన్నీ మంచి పనులే చేస్తున్నాం.. మాకెందుకు జనం 175 సీట్లకు గాను 175 సీట్లూ ఇచ్చెయ్యరు..’ అని పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అర్థ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జనాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం.? అని ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదేమో.!
జస్ట్ 28 కిలోమీటర్ల దూరం ప్రయాణం కోసం ప్రత్యేక హెలికాప్టర్. సభ నిర్వహణ కోసం లక్షల్లో ఖర్చు. ఇదంతా ప్రజాధనమే. అది దుర్వినియోగమవుతూనే వుంది. కేవలం బటన్ నొక్కే వ్యవహారానికి ఇంతలా లక్షలు ఖర్చు చేయడమంటే దీన్ని దుబారా అనక ఇంకేమంటారు.?
పత్రికల్లో ప్రకటనల ఖర్చు మళ్ళీ వేరే.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కొట్టమిట్టాడుతోందంటే.. ఇదిగో ఈ దుబారా కారణంగానే. ఇంతకీ, మొక్క జొన్న పొత్తులకు వేసిన వైసీపీ రంగు కోసం వైసీపీ ఖజానా నుంచి ఖర్చు చేశారా.? లేదంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్నారా.?