Switch to English

మార్చి 3న “రిచిగాడి పెళ్లి”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,922FansLike
57,764FollowersFollow

కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచి గాడి పెళ్లి ”. ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ కు, టీజర్ కు, పాటలకు, ట్రైలర్ కు , ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా

చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. టీజర్ చూసిన కొంతమంది ఇది 12th మ్యాన్ ఆడాప్షన్ సినిమాలా ఉంది అంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. ఇది ఏ సినిమాను చూసి కాపీ కొట్టలేదు. ఇది మా స్ట్రెయిట్ తెలుగు మూవీ.. తాజాగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. అందుకు వారికి మా ధన్యవాదాలు. మా ట్రైలర్ చూసిన తరువాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి థియేటర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మా ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్’ ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

11 COMMENTS

సినిమా

తెలుగు వచ్చిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎంకరేజ్ చెయ్యకూడదా.?

తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇకపై ఎంకరేజ్ చేయకూడదని తాను, దర్శకుడు సాయి రాజేష్ ఓ నిర్ణయం తీసేసుకున్నామంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు సినీ...

భాగ్యానికి మరో బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు...

మదరాసి.. శివ కార్తికేయన్ సూపర్ టైమింగ్..!

స్మాల్ స్క్రీన్ పై వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టి ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ధనుష్ సపోర్ట్ తో లీడ్...

మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఆరెంజ్..!

గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్...

100 కోట్ల తండేల్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా...

రాజకీయం

పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు..!

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబందించి ప్రకటన వచ్చింది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14న నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలోనే పార్టీ...

వైసీపీ అక్రమ సంబంధాల రాజకీయం.! బాబాయినే వదల్లేదు.!

అక్రమ సంబంధాలంటే వైసీపీకి ఎంత ఇష్టమో.! ఔను, వైసీపీ రాజకీయాలన్నీ అక్రమ సంబంధాల చుట్టూనే నడుస్తుంటాయ్. జనసేన పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడానికి, వైసీపీ అప్పట్లో ఇదే పంథా ఎంచుకుని, బొక్క...

ఉస్తాద్ భగత్ సింగ్ లో ఐకానిక్ సీన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉంటారని తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ పవర్ స్టార్ కి ఫ్యాన్స్ గా ఉన్నారు. ఏదైనా తెలుగు...

మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ ప్రయాణం..!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ...

56 ఏళ్ల అప్పు గత ఐదేళ్లలోనే.. జగన్ రెడ్డి నిర్వాకం ఇది

గత 56 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పుపై కట్టే వడ్డీ రూ. 14, 155 కోట్లు. ఇది 2019 నాటికి మాత్రమే. అప్పటినుంచి 2024 వరకు జగన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

Andhra Pradesh: రాష్ట్రంలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చొరవ.. ప్రముఖ సంస్థ ఆసక్తి

Andhra Pradesh: రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫార్చూన్ 500 కంపెనీ ‘సిఫీ’కు మంత్రి లోకేష్ ఆహ్వానించిన నేపథ్యంలో సిఫీ...

తెరపైకి మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్.. అల్లు అరవింద్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా కానీ సినిమాగా కానీ ఎప్పటికైనా తెరమీదకి తీసుకురావాలని...

మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ ప్రయాణం..!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ...