Switch to English

రోడ్లపై గుంతలు దుష్ప్రచారమా వైఎస్ జగన్ సారూ.!

91,319FansLike
57,013FollowersFollow

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్..’ అంటూ జనసేన పార్టీ ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది.. రాష్ట్రంలో రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలు.. కాదు కాదు, గుంతల్లో మునిగిపోయిన రోడ్ల దుస్థితి నేపథ్యంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలని జనసేన నినదిస్తోంది.. జనసేన మాత్రమే కాదు, జనసేన క్యాంపెయిన్ ద్వారా సాధారణ ప్రజానీకం కూడా రోడ్ల మీద గుంతలతో తాము పడుతున్న ఇబ్బందుల్ని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు.

ఇంకోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో లబ్దిదారుల ఖాతాల్లోకి పది వేల చొప్పున సొమ్ములు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు.. లాంటి విమర్శలు షరామామూలుగానే చేసేశారు. ప్రజలకు మేలు చేస్తున్న గొప్ప ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారమంటూ అరిగిపోయిన పాత రికార్డునే మళ్ళీ ప్లే చేశారు.

వాహన మిత్ర.. రోడ్ల మీద గుంతలు.. ఈ విషయాన్నే తీసుకుంటే, వాహనాలు గాల్లో ఎగరవ్.. అవి రోడ్ల మీదనే నడవాలి. వాహన మిత్ర లబ్దిదారులు తమ వాహనాల్ని, రాష్ట్రంలో రోడ్ల మీద తిప్పడం ద్వారా ఎంత నష్టపోతున్నదీ వాళ్ళకే తెలుసు. ఏడాదికోసారి పదివేలు ఇస్తోంది లబ్దిదారులకి వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ, దాదాపుగా ప్రతి వారం, గుంతల రోడ్లలో తిరిగే వాహనాలకు రిపెయిర్లు తప్పనిసరి. అలా వంద రూపాయల దగ్గరనుంచి పది వేల దాకా మోత మోగిపోతోంది వాహనదారులకి.

సుమారు 230 కోట్ల రూపాయల దాకా లబ్దిదారులందరీకీ ఖాతాల్లో వేసేశామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. మరి, రోడ్లను బాగు చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారట.? ఈ ప్రశ్నకు వైసీపీ సర్కారు దగ్గర సరైన సమాధానాల్లేవు. కేవలం వానా కాలంలోనే కాదు, రాష్ట్రంలో రోడ్లు నిత్య నరకం.. ఇందులో ఇంకోమాటకు తావు లేదు.

ఆయా సంక్షేమ పథకాల్ని ప్రారంభించేందుకోసమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డు మార్గాన ఆయా ప్రాంతాల్లో తిరిగితే, వాహనదారుల కష్టాలు అర్థమయ్యేవేమో.. అన్నది స్వయానా వాహనదారులు చెబుతున్నమాట. ఇందులో విపక్షాలు చేసే దుష్ప్రచారం ఏముందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి గాయం కారణంగా ఫిజికల్ టాస్కుల్లో తేలిపోతోంది....

ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు..! ఎమ్మెల్యే కొనుగోళ్లు..

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యే కొనుగోళ్లు వ్యవహారంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసులో భాగంగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది....

ఆ ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా..! 16 నెలల్లో ఎంతమందిని తొలగించారంటే..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల ప్రకారం పనితీరు సరిగాలేని రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝులిపిస్తోంది. 2021 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై...

బెంబేలెత్తిస్తున్న ‘అవతార్-2’ టికెట్ ధరలు..! దేశంలో ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అవతార్2.  ది వే ఆఫ్ వాటర్ పేరుతో విడుదలవుతున్న సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకుడు. ఇటివల రిలీజైన రెండో టీజర్ హీట్ పెంచుతోంది....

రాశి ఫలాలు: సోమవారం 21 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:09 సూర్యాస్తమయం: సా.5:26 తిథి: కార్తీక బహుళ ద్వాదశి ఉ.7:20 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: స్థిర వాసరః (సోమవారం) నక్షత్రము:చిత్త రా.11:44 వరకు తదుపరి స్వాతి యోగం:...