Switch to English

‘కింగ్‌ మేకర్‌’ పదవిపై కన్నేసిన ప్రశాంత్‌ కిషోర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ప్రశాంత్‌ కిషోర్‌.. ఎన్నికల వ్యూహకర్తగా అందరికీ తెలుసు. అంతే కాదు, ఈయన ఇప్పటికే రాజకీయ నాయకుడిగా అవతారమెత్తేశారు బీహార్‌లో. అయితే, ప్రస్తుతం ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధాల్లేవు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆవ్‌ు ఆద్మీ పార్టీ కోసం ‘వ్యూహకర్త’గా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌, త్వరలో తమిళనాడు రాజకీయాల్ని మార్చేయబోతున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ, ప్రశాంత్‌ కిషోర్‌ని వ్యూహకర్తగా నియమించుకుంది.

కాగా, త్వరలో ప్రశాంత్‌ కిషోర్‌ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తబోతున్నారనీ, అయితే ఆయన ‘కింగ్‌ మేకర్‌’గా మాత్రమే వుండాలనుకుంటున్నారనీ జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ యేతర రాజకీయ పార్టీల్ని ఒక్కతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్‌ కిషోర్‌ తన వ్యూహాలకు పదును పెట్టబోతున్నారట. అది తమిళనాడు నుంచే ఆయన ప్రారంభిస్తారట కూడా.

ప్రశాంత్‌ కిషోర్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ‘వ్యూహకర్త’గా ప్రశాంత్‌ కిషోర్‌ తన సేవల్ని అందించిన విషయం విదితమే. వైఎస్‌ జగన్‌ ద్వారా కేసీఆర్‌కి సైతం ప్రశాంత్‌ కిషోర్‌ అత్యంత సన్నిహితుడయ్యారట. మరోపక్క, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ప్రశాంత్‌ కిషోర్‌ సేవల్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోబోతోంది. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలో తనకున్న రాజకీయ పరిచయాలతో ‘కింగ్‌ మేకర్‌గా’ అవతారమెత్తాలన్న ఆలోచన ప్రశాంత్‌ కిషోర్‌కి కలిగిందట.

దాంతో, తన వ్యూహాలకు ఆయన మరింత పదును పెడుతున్నారనీ, చట్ట సభలకు సైతం ఎంపిక కావాలనే ఆలోచనతో వున్నారనీ తెలుస్తోంది. అయితే, రాజకీయ పార్టీలకు సహకరించడం వేరు.. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్ని ఫేస్‌ చేయడం వేరు. వ్యూహకర్తగా ఆయన సక్సెస్‌ అయి వుండొచ్చుగాక. కానీ, రాజకీయ నాయకుడిగా ఆయన స్టామినా ఏంటి.? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఒకప్పుడు నరేంద్ర మోడీ కూడా ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు తీసుకున్నారు. అంతమాత్రాన, మోడీని ఢీకొట్టేంత రాజకీయ స్టామినా ప్రశాంత్‌ కిషోర్‌కి వుందనగలమా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...