Switch to English

వైసీపీని అడిగి మరీ తన్నించుకుంటున్న టీడీపీ!

ఎలాగోలా తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. అధికారం సంగతి తర్వాత.. కనీసం టీడీపీ 2024 ఎన్నికల్లో తన ఉనికిని అయినా చాటుకునే పరిస్థితి వుంటుందా.? అన్నది తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోన్న ఆందోళన. కింది స్థాయిలో పార్టీ క్యాడర్‌ ఏమనుకుంటుందో చంద్రబాబుకి అనవసరం. ‘40 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అని చెప్పుకుని తిరుగుతుంటారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.

ఈ క్రమంలో చంద్రబాబు, తనకు అనుకూలమైన మీడియాని అడ్డగోలుగా వాడేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తూనే వున్నాం. మొన్న కియా, ఇప్పుడేమో.. విశాఖ మిలీనియం టవర్స్‌ – ఇండియన్‌ నేవీ విధానం.. అక్కడ ఏం జరుగుతోందన్నదానిపై స్పష్టత వుండదుగానీ.. టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి యాగీ చేసేస్తుంటారు. కియా ఎపిసోడ్‌లో ఆల్రెడీ టీడీపీకి దిమ్మత తిరిగి బ్లాంక్‌ అయ్యింది. ఇప్పుడేమో, ‘మిలీనియం టవర్స్‌ విషయంలో ఇండియన్‌ నేవీ, జగన్‌ సర్కార్‌కి షాకిచ్చింది..’ అని టీడీపీ నేతలు యాగీ చేస్తే, ‘అంతా ఉత్తదే’ అని సాక్షాత్తూ ఇండియన్‌ నేవీ తేల్చి చెప్పేసింది.. దాంతో మరోమారు తల బొప్పి కట్టింది టీడీపీకి.

టీడీపీ – వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామానా.? లేదంటే, రెండు పార్టీల మధ్యా నిజంగానే వైరం వుందా.? అన్నది రాష్ట్ర ప్రజలకు అర్థం కావడంలేదు. అవును మరి, వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. నానా రకాలుగా టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, అవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. చేతల్లో ఏమీ కన్పించడంలేదు. ‘నువ్వు తన్నినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తా..’ అన్నట్లుంది వ్యవహారం.

ఈ అడిగి తన్నించుకునే ఆటని టీడీపీ ఎన్నాళ్ళు ఆడుతుందో.. టీడీపీ అడగ్గానే తన్నినట్లు నటించే నాటకం వైసీపీ ఎన్నాళ్ళు ఆడుతుందోగానీ.. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారన్నది నిర్వివాదాంశం. కియా ఎపిసోడ్‌తో రాష్ట్రం పరువు పోయింది. ఇప్పుడేమో, ఇండియన్‌ నేవీ దృష్టిలోనూ రాష్ట్రంలోని రాజకీయం అభాసుపాలయ్యింది. కానీ, అధికారపక్షం, ప్రతిపక్షం.. ‘నవ్విపోదురుగాక మనకేటి.?’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయి 9 నెలలు పూర్తి కావొస్తోంది.. రాష్ట్రంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదాయె. ఇదీ రాష్ట్రంలో అభివృద్ధి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ప్రకంపనలు రేపుతున్న నాగబాబు కొత్త ట్వీట్.!

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...