మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కనాకష్టంగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. జస్ట్ ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే టీడీపీలో యాక్టివ్‌గా వున్నారాయన.
చాలాకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు కనిపించడంలేదు. చంద్రబాబు విశాఖకు వెళ్ళినా ఆయన్ని గంటా కలవడంలేదు. అసెంబ్లీలోనూ టీడీపీతో కలిసి కనిపించడంలేదాయె. కానీ, గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా హ్యాండిల్‌లో మాత్రం, ఇంకా టీడీపీకి సంబంధించిన బ్యానర్లే కనిపిస్తున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన గంటా, అప్పట్లో చిరంజీవితో ఏర్పడిన పరిచయం నేపథ్యంలో, ఆ స్నేహాన్ని ఇంకా కొనసాగిస్తున్నమాట వాస్తవం. అలాగని చిరంజీవి ఏనాడూ, గంటా శ్రీనివాసరావునే కాదు, ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ఏ నాయకుడితోనూ రాజకీయంగా ఆ తర్వాత సంబంధాలు కొనసాగించలేదు.. తన భావజాలాన్ని వారిపై రుద్దలేదు కూడా.
అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు.. చెప్పుకుంటూ పోతే గంటాతోపాటు చాలామంది మాజీ పీఆర్పీ నేతలు, వేర్వేరు పార్టీల్లో వున్నారు.. తమ తమ రాజకీయాలు చేసుకుంటున్నారు. టీడీపీలోంచి బయటకు వచ్చేసి వైసీపీలో చేరమని గంటా శ్రీనివాసరావుకి చిరంజీవి సలహా ఇస్తారా.? ఇవ్వగలరా.? ఆ సలహా చిరంజీవి ఇచ్చేవారే అయితే, గంటా అసలు టీడీపీలోకి ఎందుకు వెళతారు.?
రాజకీయంగా టీడీపీలో ఇమడలేకపోతున్నారు గంటా. బీజేపీలోకి వెళదామని ట్రై చేశారు. జనసేన పార్టీతోనూ టచ్‌లోకి వెళ్ళారు.. ఇప్పుడు వైసీపీతోనూ టచ్‌లో వున్నారనే ప్రచారమైతే జరుగుతోంది.