Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఆనందయ్య నాటు మందుపై ఎందుకీ వివాదాలు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అది ప్రస్తుతానికి నాటు మందు మాత్రమే. కరోనా వైరస్ మీద ఆ నాటు మందు ప్రభావం ఎంత.? అన్నదానిపై ఎలాంటి ఖచ్చితమైన సమాచారమూ లేదు. ఆయుర్వేద మెడిసిన్.. అంటే, దానికి కొన్ని లెక్కలుంటాయి.. అధికారిక ధృవీకరణలు వుంటాయి. కానీ, ఆనందయ్య నాటు మందుకి అలాంటివేమీ లేవు. మందు వేసుకున్నవాళ్ళలో ఎంతమందికి నయమైందీ తెలియదు. నిజానికి, ప్రభుత్వానికి ఆ వివరాలు సేకరించడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా, ఎందుకో ఆనందయ్య నాటు మందు గురించి మొదటి నుంచీ రాజకీయమే వెర్రి తలలు వేస్తోంది. పొలిటికల్ క్రెడిట్ కోసం మొదటి నుంచీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.

 

‘మూడో వేవ్ వచ్చినా సరే, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం..’ అని ఆనందయ్య చెబుతోంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థి సామాన్యుల్లో కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ దెబ్బకి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆనందయ్య నాటు మందులో ఏమేం వుంటాయన్నది ప్రపంచమంతటికీ తెలుసు. ఆ మందులో అంత ‘విషయం’ వుంటే, ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక మూల, అలాంటి మందుని తయారు చేసేసి, మార్కెట్లోకి తెచ్చేసేవే ఔషధ తయారీ సంస్థలు. కానీ, అలా జరగడంలేదంటే, దానర్థమేంటి.? మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే, బోల్డంతమంది నాటు వైద్యులున్నారు.. శాస్రీయ ఆధారాలతో ఆయుర్వేద మందుల్ని తయారు చేసే వైద్యులూ వున్నారు. వాళ్ళెవరికీ ఆనందయ్యలా ‘నాటుమందు’ తయారు చేయడం రాదని ఎలా అనుకోగలం.? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. చిత్రంగా ఆనందయ్య మందు గురించి సినీ సెలబ్రిటీలు కూడా పబ్లిసిటీ షురూ చేశారు.

 

ఆనందయ్య మందు, ఒక్కర్ని కాపాడినా అది అభినందించాల్సిన విషయమే. కానీ, అలా కాపాడినట్లు సాక్ష్యాధారాలు కనిపించడంలేదు. ఇంకోపక్క, ఆనందయ్య మందు పేరుతో బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగిపోయాయి. ఏకంగా 25 వేలు ఆ పైన ఖర్చు చేసి కొందరు కొనుక్కున్నారట. ఇంకా అమ్మకాలు జరుగుతూనే వున్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య మాత్రం, తాను ప్రభుత్వ సూచన మేరకు గతంలోనే మందు తయారీ ఆపేశానంటున్నాడు. ఇంతకీ, ఈ మ్యాజిక్ ఏంటి.? నాటు మందు రాజకీయమేంటి.? అన్నట్టు, ఆనందయ్య మందుని 167 రూపాయలకు ఓ ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏకంగా ఓ వెబ్ సైట్ తయారైందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఆ వెబ్ సైట్ అధికార పార్టీకి చెందిన నాయకుడిదట. ఆనందయ్య మాత్రం, ఆ వెబ్ సైట్ విషయంలో తమకేమీ సంబంధం లేదంటున్నాడు. ఈ వైపరీత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలట.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...