Welfare Schemes: ‘ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. చేసినవి చెప్పుకుంటున్నాం.. జనం ఎందుకు మళ్ళీ మనకు ఓటెయ్యరు.?’ అంటూ అతి ధీమా ప్రదర్శిస్తోంది అధికార వైసీపీ. ఆ ధీమాలో బోల్డంత భయం కనిపిస్తోంది. ఎందుకంటే, సంక్షేమమం మాత్రమే ఎన్నికల్లో తమను గెలిపిస్తుందనుకోవడం పొరపాటని వైసీపీ అధినాయకత్వానికీ తెలుసు. కాకపోతే, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి.. తప్పదు.. అదే జరుగుతోంది కూడా.!
ఇంతకీ, సంక్షేమం గురించి ప్రజలేమనుకుంటున్నారు.? ఈ విషయమై అధికార పార్టీ అంతర్గత సర్వేల్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగు చూస్తున్నాయట. ‘సంక్షేమం ఎవడబ్బ సొమ్ము.? వైసీపీ నాయకులేమన్నా జేబుల్లోంచి తీసి ఖర్చు చేస్తున్నారా.?’ అని జనం నిలదీస్తున్న పరిస్థితులు ‘గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమం’ ద్వారా వైసీపీ నాయకులకు తెలిసొస్తోంది.
మీడియా అంటే కేవలం మెయిన్‌స్ట్రీమ్ మీడియా మాత్రమే కాదు. న్యూస్ ఛానళ్ళు, పత్రికల్ని విశ్వసించడం జనమెప్పుడో మానేశారు. వెబ్ మీడియాలోనూ పైత్యం వుందన్న విషయాన్ని జనం గుర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ‘చెత్త’ సంగతెలా వున్నా, అక్కడే వాస్తవాలు దొరుకుతున్నాయి జనానినికి.
యూ ట్యూబ్ ఛానళ్ళు అనండీ, ఇంకోటనండీ.. జనాభిప్రాయం వీటితో స్పష్టంగా తెలుస్తోంది. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సంపాదనని జనం కోసం ఖర్చు చేస్తున్నారు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి సైతం ఆయన విరాళాలు అందిస్తున్నారు.. వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఇలా సొంత సంపాదనని జనం కోసం ఖర్చు చేశారా.?’ అని సామాన్యులు నిలదీస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘దొంగ… గజదొంగ..’ వీళ్ళని నమ్ముతారా.? జనసేనను నమ్ముతారా.? అంటూ, టీడీపీ, వైసీపీ పార్టీ గురించి.. అలాగే జనసేన గురించీ పేర్కొంటున్నారు కొందరు జనం. ఈ తరహా వీడియోలు ఇటీవలి కాలంలో చాపకింద నీరులా వైరల్ అవుతున్నాయి. జనాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. ప్రధానంగా ‘సంక్షేమం ఎవడబ్బ సొమ్ము.?’ అన్న ప్రశ్న అటు టీడీపీకి, ఇటు వైసీపీకి.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
129819 859006U never get what u expect u only get what u inspect 784212
263605 538456This internet web page is genuinely a walk-through for all of the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 311745
773958 518020Hi my friend! I want to say that this post is awesome, good written and include almost all significant infos. Id like to see more posts like this . 287430
496865 101374Thanks for sharing superb informations. Your web site is very cool. 389108
214668 749530I as properly believe thence , perfectly pent post! . 938835