లైగర్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఆగష్టులో విడుదలైన ఆయన హీరోగా నటించిన లైగర్ సినిమా లావాదేవీల అంశంలో ఈడీ అధికారులు విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. లైగర్ సినిమా విషయంలోనే ఇటివల ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత చార్మీ కూడా ఈడీ ముందు హాజరయ్యారు. వారిని రోజంతా ప్రశ్నించారు. ఇప్పుడు విజయ్ ను విచారిస్తున్నారు.
లైగర్ సినిమా వ్యవహారంలో పెట్టిన పెట్టుబడులపై ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సినిమా నిర్మాణంలో దుబాయ్ కి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి తెప్పించి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాధమికంగా గుర్తించారు. ఇందులో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన వారిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా లైగర్ సినిమా తెరకెక్కింది.