తాను ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు ఇటివల వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ అంటూ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కొట్టిపారేసింది.
‘నేను ప్రేమలో లేను. ఆ రియాల్టీ షోలో మన బేధియా (వరుణ్ ధావన్) కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆ మటలు ఇప్పుడు ఎన్నో గాసిప్స్ రావడానికి నాంది పలికింది. వెబ్ సైట్లు కొన్ని ఈ మాటలను ఆధారంగా చేసుకున నా పెళ్లి తేదీ ఫిక్స్ చేసేకంటే ముందే ఈ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నా. నేను ప్రేమలో ఉన్నానన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు’ అని వివరణ ఇచ్చింది.
భేదియా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ ఓ రియాల్టీ షోలో కృతిసనన్ ఓ హీరో మనసులో ఉంది. అతను ముంబైలో లేడు.. దీపికా పదుకొణేతో షూటింగ్ లో ఉన్నాడు అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కృతిసనన్ ఇన్ స్టాలో క్లారిటీ ఇచ్చింది.