Switch to English

Veera Simha Reddy Review: వీర సింహారెడ్డి రివ్యూ: బోరింగ్ ఫ్యాక్షన్ డ్రామా

Critic Rating
( 2.00 )
User Rating
( 2.10 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie Veera Simha Reddy
Star Cast Bala Krishna
Director Gopi Malineni
Music Thaman S

Veera Simha Reddy Review: అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం చాలా కామన్ విషయం. ఆ అంచనాలను అందుకునే విధంగా వీర సింహారెడ్డి సినిమాను తీశాను అంటూ దర్శకుడు గోపీచంద్‌ మలినేని చాలా నమ్మకంతో చెప్పాడు. విడుదలకు ముందే భారీ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ :

జై (బాలకృష్ణ), అతడి తల్లి మరియు సంధ్య లు టర్కీ లో నివసిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో జై తండ్రిని కలవాలని సంధ్య తండ్రి పట్టుబడతాడు. దాంతో జై తండ్రి వీర సింహారెడ్డి టర్కీలో ల్యాండ్ అవుతాడు. అప్పుడే జై తన తండ్రి వీర సింహారెడ్డిని మొదటి సారి చూస్తాడు. వీర సింహారెడ్డి టర్కీ లో ల్యాండ్ అయ్యింది మొదలు అతడి ఫ్ల్యాష్‌ బ్యాక్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంతకు వీర సింహారెడ్డి గతం ఏంటీ? ఫ్యామిలీకి దూరంగా వీర సింహారెడ్డి ఎందుకు ఉండాల్సి వచ్చింది… సినిమాను చూసి తెలుసుకోండి.

నటీనటులు:

వీర సింహారెడ్డి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. బాలకృష్ణ మాస్ లుక్ లో… గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి లుక్ లో చాలా నాచురల్‌ గా కనిపించాడు. గతంలో బాలయ్యను ఇలాంటి పాత్రల్లో చాలా సార్లే చూశాం. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో మరోసారి తానేంటో చూపించాడు.. అంతే కాకుండా మాస్ డైలాగ్స్ తో అలరించాడు.

శృతి హాసన్‌ లుక్స్ పరంగా అలరించింది. ముఖ్యంగా డాన్స్ లతో శృతి హాసన్‌ ఆకట్టుకుంది. కానీ ఆమెకు నటనపరంగా పెద్దగా స్కోప్‌ దక్కలేదు. ఆమె కొన్ని కామెడీ సన్నివేశాల్లో బోర్ కొట్టించింది. సినిమాలోని హనీ రోజ్‌ పాత్ర నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న పాత్రలో అయినా కూడా ఆమె సాధ్యమైనంత మేరకు ఆకట్టుకుంది. ఆమెకు నటనకు మంచి స్కోప్ దక్కింది.

సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పాత్రకు కరెక్ట్‌ గా సెట్‌ అయ్యింది. ప్రతి సన్నివేశంలో కూడా ఆమె భావోద్వేగాన్ని చూపించి ఆకట్టుకుంది. బాలకృష్ణ తో ఉన్న సన్నివేశాల్లో వరలక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక మిగిలిన నటీ నటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు :

కథ మరియు కథనంలో కొన్ని ట్విస్ట్‌ లతో దర్శకుడు గోపీచంద్‌ ప్రేక్షకులను సర్ ప్రైజ్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌ లోని స్క్రీన్‌ ప్లే కాస్త సాగతీసినట్లుగా ఉంది. సెకండ్ హాఫ్ వరకూ పర్వాలేదు. స్క్రీన్‌ ప్లే లో కామెడీ సన్నివేశాలను బలవంతంగా జొప్పించే ప్రయత్నం విఫలం అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో మరీ బోరింగ్ గా అనిపించింది. ఈ సినిమాకు వరలక్ష్మి యొక్క పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

అఖండ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థాయిలో బీజీఎం లేదనే చెప్పాలి. అలా అని తీసిపడేయలేం. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్ తో నిలబెట్టాడు. పాటలు కొన్ని బాగున్నాయి. సినిమా నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. కెమెరా పనితనం బాగుంది. సినిమా రన్‌ టైమ్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్లు :

  • బాలకృష్ణ గెటప్
  • ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
  • పాటలు

మైనస్ పాయింట్లు :

  • వినోదం లేకపోవడం
  • సినిమా రన్‌టైమ్
  • పాత కాన్సెప్ట్‌

విశ్లేషణ:

అఖండ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా అవ్వడం… అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెప్పడంతో అంచనాలు పెరిగాయి. అయితే ఇది ఒక రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా మాత్రమే. మొదటి సగం బోరింగ్‌ గా అనిపించినా సెకండ్‌ హాఫ్‌ పర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది. అయితే రెగ్యులర్‌ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా రొటీన్ ఫ్యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది.

Click Here for Live Updates

అఖండ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా అవ్వడం… అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెప్పడంతో అంచనాలు పెరిగాయి. అయితే ఇది ఒక రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా మాత్రమే. మొదటి సగం బోరింగ్‌ గా అనిపించినా సెకండ్‌ హాఫ్‌ పర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది. అయితే రెగ్యులర్‌ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా రొటీన్ ఫ్యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...