ఉగాది అనగానే అందరికీ ప్రత్యేకమైన ‘పచ్చడి’ సుపరిచితమే. షడ్రుచులు.. ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు.. ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి. తియ్యటి అనుబంధం.. మనలోని మలినాల్ని దూరం చేసే చేదు.. ఇలా దేనికదే ప్రత్యేకం షడ్రుచుల్లో. ఒకటి కావాలి, ఇంకోటి వద్దు.. అని అనగలమా.? జీవితం కూడా అంతే. అంతా మన మంచికేనని ముందడుగు వేయాల్సిందే. ప్రతి ఏడాదిలా కాదు, ఈసారి ఉగాది చాలా చాలా ప్రత్యేకం.
ఎందుకంటే, ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతోంది. భారతదేశం మొత్తం లాక్డౌన్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఉగాది పండుగని సంబరాల పండుగలా చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. అయినాసరే, ఎవరికి వారు తమ ఇంట్లో తమకు తోచిన విధంగా పండగ చేసుకోకుండా వుండలేరు కదా.! ఈ ఉగాదికి మనం చాలా చాలా పాఠాలు నేర్చుకోవాల్సిందే.
నిజానికి అవేమీ కొత్త పాఠాలు కాదు.. పాతవే. అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పినవే. కానీ, ట్రెండ్ మారిందంటూ.. మనల్ని మనం చాలా మార్చేసుకున్నాం. కొన్నిసార్లు మార్పు కూడా మంచిదే. కానీ, ఆ మార్పు కూడా ‘ముప్పు’ తెచ్చిపెడుతుందనడానికి కరోనా వైరస్ వ్యాప్తి నిదర్శనం. ఇకపై మారదాం.. మంచి వైపు అడుగులేద్దాం.. ట్రెండ్ మార్చుదాం.. మన సంప్రదాయాల్ని మాత్రం నాశనం చేసుకునేది లేదని ప్రతిజ్ఞ చేద్దాం. పరిస్థితులు సద్దుమణిగాక అందర్నీ కలవడం మామూలేగానీ, అలా కలిసేటప్పుడు ‘షేక్ హ్యాండ్, కౌగలింతలు’ పక్కన పెట్టి, సంస్కారవంతంగా నమస్కారం చేయడానికే పరిమితమవుదాం.
ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేయడం మానేద్దాం. ఇంకా ఇంకా చాలా చెయ్యాలి.. అవన్నీ చేద్దాం. ‘కరోనా సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..’ అని ఇప్పుడు ప్రపంచ దేశాలు చెబుతున్నవన్నీ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని మూల సూత్రాలే. వాటిని ఇప్పుడు విదేశాలే పాటిస్తున్నాయి.. అలాంటిది, ఆ వారసత్వం మన ఆస్తి.. దాన్ని మనం కాపాడుకోలేమా.?
మన తెలుగువారికి ఉగాది పండుగ.. అంటే, తెలుగు సంవత్సరం నేటి నుంచే ప్రారంభం అని. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా.! అలా, ఈ ఉగాది పండక్కి కూడా మన సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకుంటామని రిజల్యూషన్ తీసుకుందాం. అది మనల్ని రక్షించడమే కాదు, మన చుట్టూ వున్నవారిని కూడా రక్షిస్తుంది.
601593 395729Your talent is actually appreciated!! Thank you. You saved me a lot of frustration. I switched from Joomla to Drupal towards the WordPress platform and Ive fully embraced WordPress. Its so a lot easier and easier to tweak. Anyway, thanks once again. Awesome domain! 349297
590271 379643Good read, I just passed this onto a colleague who was performing some research on that. And he truly bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 90589
787891 412373This post is very appealing to thinking folks like me. Its not only thought-provoking, it draws you in from the beginning. This really is well-written content. The views here are also appealing to me. Thank you. 357672