Switch to English

వందకోట్ల సినిమాల ‘ఫ్యాక్టరీ’ గా అవతరించిన “పీపుల్ మీడియా”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇది అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణసంస్థ నుంచి రిలీజైన రెండు సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

టీజీ విశ్వప్రసాద్ 2017 లో స్థాపించిన ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మొదటి అమెరికాలో ఇండిపెండెంట్ సినిమాలను నిర్మించింది. నందమూరి కళ్యాణ్ రామ్ Mla సినిమాతో వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా తెలుగులో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది ఈ సంస్థ.

టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఎన్నో హిట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. “గూడాచారి” “ఓ బేబీ” “రాజ రాజ చోరా” వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో పాటు “వెంకీ మామా” “A1 ఎక్స్‌ప్రెస్” వంటి జనాదరణ పొందిన సినిమాలను నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. 2022 సంవత్సరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన కార్తికేయ-2, ధమాకా సినిమాలు వందకోట్ల వసూళ్లను రాబట్టాయి.

నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి దర్శకత్వంలో నటించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ ను రాబట్టింది. చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దాదాపుగా 120 కోట్లకు పైగా వసూలు చేసి, పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎంతో భారీగా నిర్మించిన ఈ మూవీ భారతీయ సనాతన ధర్మం, కృష్ణతత్వానికి సంబంధించిన ఒక కీలక అంశాలను ఆధారంగా అడ్వెంచరస్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

ఇదే బ్యానర్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ధమాకా. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీన్లుగా నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ కలక్షన్స్ సునామి సృష్టిస్తుంది. మాస్ మహారాజా అభిమానులకు ఈ సినిమా మంచి ట్రీట్.

ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు వందకోట్లు వసూలు చేయడం సాధారణ విషయమే. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు, అభిమానులకు వినోదాన్ని అందించే సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అనేది రేర్ థింగ్. కార్తికేయ-2, ధమాకా ఈ రెండు సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రావడం విశేషం.

ప్రస్తుతం ఈ బ్యానర్ లో మరికొన్ని సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. గోపీచంద్-శ్రీవాస్ రామబాణం, అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి, అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అగ్రహీరోలైనా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు కూడా బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్నాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...