Switch to English

తిరుమల లడ్డూ.. ఉచితం పేరుతో బాదుడే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న విలువే వేరు. పెద్ద సంఖ్యలో లడ్డూలు పొందడం కోసం ఏకంగా సిఫార్సు లేఖలు కూడా తీసుకెళ్తుంటారు. అలాంటి లడ్డూ ఇకపై మరింత ప్రియం కానుంది. లడ్డూ ప్రసాదం ధరను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ రకాల దర్శనాలు చేసుకునే భక్తులకు ఒక్కో ధర నిర్ణయించి, ఆ మేరకు లడ్డూలు ఇస్తున్నారు.

కాలినడక భక్తులకు రూ.10కి ఒక లడ్డూ చొప్పున రెండు లడ్డూలు ఇస్తున్నారు. అలాగే సర్వ దర్శనం, టైంస్లాట్ భక్తులకు కూడా రూ.10కి ఒకటి చొప్పున రెండు లడ్డూలు.. అదనంగా రూ.25కి ఒక లడ్డూ చొప్పున మరో రెండు ఇస్తున్నారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే భక్తులకు రెండు లడ్డూలు ఉచితంగా, రూ.25కి ఒకటి చొప్పున మరో రెండు లడ్డూలు ఇస్తున్నారు. ఇకపై ఇవేవీ ఉండవు.

శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనుంది. ఆపై ఎన్ని లడ్డూలు కావాలన్నా రూ.50కి ఒకటి చొప్పున కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 6న వైకుంఠ ఏకాదశి నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనుంది. వాస్తవానికి లడ్డూ ధరలపై భరిస్తున్న రాయితీని ఎత్తివేయాలని ఇటీవలే టీటీడీ భావించింది. లడ్డూ ధరను రూ.25 నుంచి రూ.50కి పెంచాలని అనుకుంది. అయితే, దీనిపై నిరసనలు వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. తాజాగా ఉచిత లడ్డూ పేరుతో భక్తులపై బాదుడుకి తెర తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నామని గొప్పగా చెబుతూ.. లడ్డూ ధరలు పెంచడంతో భక్తుల జేబులకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం ఒక భక్తుడికి రూ.70కి నాలుగు లడ్డూలు వస్తుండగా.. ఇకపై అవే నాలుగు లడ్డూలకు రూ.150 చెల్లించాల్సిందే. ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో తీసుకోవడం అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుందన్నమాట. ఒక్కో లడ్డూ తయారీకి రూ.40 ఖర్చు అవుతోందని చెబుతున్న టీటీడీయే దాని ధరను రూ.50గా నిర్ణయించడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...