Switch to English

తిరుపతి ఉప ఎన్నిక: ఫేక్ ఓట్లే వైసీపీని గెలిపించాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. వైసీపీ ఆశించినట్లు ఐదు లక్షల మెజార్టీ రాలేదు. మెజార్టీ దాదాపుగా 2.7 లక్షలు మాత్రమే వచ్చింది. నిజానికి, ఇది వైసీపీకి బంపర్ విక్టరీ. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రోజున జరిగిన పరిణామాల్ని చూస్తే, ఈ మెజార్టీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతలా దిగజారిపోవాలా.? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

దాదాపు రెండున్నర లక్షల ఫేక్ ఓట్లు వైసీపీ వేయించిందంటూ విపక్షాలు ఆరోపించడం తెలిసిన విషయమే. ఉత్త ఆరోపణ కాదిది, ఫేక్ ఓటర్లు తిరుపతి ఉప ఎన్నిక వేళ పోటెత్తారు. విపక్షాలు ఆరోపించిన స్థాయిలో కాకపోయినా, గట్టిగానే ఫేక్ ఓట్లు పడ్డాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు కూడా ఈ ఫేక్ ఓటర్ల కారణంగా తమ ఓట్లను వేసుకోలేకపోయారు.

మరోపక్క, చాలామంది ఓటర్లు (వీళ్ళు రియల్) తమ ఓట్లు గల్లంతయ్యాయని పోలింగ్ కేంద్రాల వద్ద వాపోయారు. తమ ఓట్లను ఎవరో వేసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే, ఓ పక్క విపక్షాలకు పడాల్సిన ఓట్లను ‘కట్’ చేస్తూనే, ఇంకోపక్క ఫేక్ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దించిందని అనుకోవాలేమో. అయినాగానీ, మూడు లక్షల ఫేక్ ఓట్లను వేయించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఖచ్చితంగా తిరుపతిలో వైసీపీ తన సొంత బలంతోనే గెలిచింది. కానీ, వచ్చిన మెజార్టీలోనే.. మెజార్టీ ఓట్లు ఫేక్.. అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

‘వైసీపీ గుర్తు ఇకపై ఫ్యాన్ కాదు.. వైసీపీని గెలిపించింది బస్సు.. అందుకే, ఇకపై ఆ పార్టీ గుర్తు బస్సు..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. విద్యా సంస్థలకు చెందిన బస్సుల్ని పెద్దయెత్తున దొంగ ఓట్ల కోసం వైసీపీ వినియోగించిన విషయం విదితమే. ఎన్నిక జరిగిపోయింది.. పలితం వచ్చేసింది.. ఇకపై, ఈ ఆరోపణలు ఇంకా కొనసాగడం అనవసరం. కానీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి వుంటుందా.? అన్నదే సర్వత్రా వెల్లువెత్తుతున్న అనుమానం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...