Switch to English

ఫ్లాష్ న్యూస్: ఏపీలో తప్పతాగి వీరంగం సృష్టించిన డాక్టర్‌

డాక్టర్‌ సుధాకర్‌, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేశాడు. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో అధికార పార్టీ నేతలే మాస్క్‌లు విచ్చలవిడిగా వాడేస్తున్నారనీ, డాక్టర్లకు అవసరమైన మేర మాస్క్‌లు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ వార్తల్లోకెక్కాడీ డాక్టర్‌ సుధాకర్‌. ఈ క్రమంలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.

చివరికి ప్రభుత్వం, డాక్టర్‌ని సస్పెండ్‌ చేసింది. తెలుగుదేశం పార్టీ అండదండలతో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశాడన్నది డాక్టర్‌ సుధాకర్‌పై అధికార పార్టీ వాదన. ఇక, ఇప్పుడీ డాక్టర్‌ తప్పతాగి, నడి రోడ్డు మీద బూతులు మాట్లాడుతూ చిక్కాడు. ఈ బూతు పురాణం మామూలుగా లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని పట్టుకుని అనరాని బూతు మాటలు అన్నాడు. దాంతో, వైసీపీ అభిమానులకు ఒళ్ళు మండింది. కొందరు చితకొట్టేశారు. పలువురు పోలీసులు కూడా డాక్టర్‌ని చితక్కొట్టినట్లు తెలుస్తోంది.

వైద్యుడి ప్రవర్తన సంగతి పక్కన పెడితే, అతన్ని తాళ్ళతో కట్టేసిన వైనం, చితక్కొట్టిన వైనం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఓ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోపక్క, తప్పతాగి రోడ్డు మీద నానా యాగీ చేస్తున్న డాక్టర్‌పై కేసు నమోదు చేశామనీ, ఆసుపత్రికి తరలించి ఆల్కహాల్‌ మోతాదు ఎంత వుందో పరీక్షిస్తున్నామనీ పోలీస్‌ అధికారులు తెలిపారు.

నిత్యం వాహనాలతో రద్దీగా వుండే రహదారిపై డాక్టర్‌ న్యూసెన్స్‌ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. మరోపక్క, దళిత డాక్టర్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

ఇక్కడ ‘కులం’ ప్రస్తావన ఎందుకు వచ్చిందోగానీ, మద్యం మత్తులో డాక్టర్‌ సుధాకర్‌ వాడిన భాషని ఎవరూ హర్షించరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రిని బూతులు తిడితే, ముఖ్యమంత్రిని అభిమానించే వైసీపీ కార్యకర్తలు ఊరుకుంటారా.? అయితే, ఇందులో పోలీసులు ఎందుకు లారీలు ఝుళిపించాల్సి వచ్చింది.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏమో, ఈ వ్యవహారం ఎన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో, ఎంత రాజకీయ దుమారం రేపుతుందో వేచి చూడాల్సిందే.

 

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ...

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...