Switch to English

సందీప్ కిషన్ గల్లీ రౌడీ మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.30 )

No votes so far! Be the first to rate this post.

Movie గల్లీ రౌడీ
Star Cast సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా తదితరులు
Director జి. నాగేశ్వర రెడ్డి
Producer కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ
Music రామ్ మిరియాల, సాయి కార్తీక్
Run Time 2 hr 23 mins
Release 17 September 2021

సందీప్ కిషన్ కెరీర్ హిట్స్, ప్లాప్స్ తో సమంగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం గల్లీ రౌడీ. టాలెంటెడ్ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాసును (సందీప్ కిషన్)ను రౌడీగా తయారుచేస్తాడు తన తాత. ఆ రకంగా గల్లీ రౌడీగా మారిన వాసుకు వెంకట్ రావు (రాజేంద్ర ప్రసాద్)కు సంబంధించిన ప్రాపెర్టీను అక్కడే రౌడీ పోలీస్ అయిన రఘు నాయక్ (బాబీ సింహా) నుండి కాపాడాల్సి వస్తుంది. రఘు నాయక్ కారణంగా బాబీ సింహా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రఘు నాయక్ కు వెంకట్ రావు ప్రాపెర్టీకి సంబంధం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

సందీప్ కిషన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. కాకపోతే కొన్ని చోట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీ చూపించాడు. ఇక కొన్ని హీరోయిజం సన్నివేశాలు ఓవర్ బోర్డ్ అయినట్లు అనిపించాయి. బాబీ సింహాకు ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్ర దొరికింది కానీ తన విలనిజాన్ని 90ల కాలంలో విలన్లలా డిజైన్ చేయడంతో అంత ఎఫెక్టివ్ గా అనిపించదు.

నేహా శెట్టి క్యూట్ గా ఉంది. సందీప్ తో ఈమె కెమిస్ట్రీ చూడముచ్చటగా కూడా ఉంది. రాజేంద్ర ప్రసాద్, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళి తదితరులు తమ పరిధుల మేరకు నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ వేస్ట్ అయింది.

సాంకేతిక నిపుణులు:

సందీప్ కిషన్ తో తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చిత్రాన్ని తెరకెక్కించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. దానిలా ఈ చిత్రాన్ని కూడా లౌడ్ కామెడీ ఎంటర్టైనర్ గా డిజైన్ చేసాడు. కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఉండేలా చూసుకున్నాడు. అయితే ఓల్డ్ రొటీన్ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రతిబంధకంగా మారింది. రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం పర్వాలేదు. రెండు పాటలు బాగున్నాయి. కానీ వాటిని చిత్రీకరించిన విధానం నిరాశపరుస్తుంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ ఓకే. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • ప్రీ ఇంటర్వెల్ కిడ్నప్ డ్రామా
  • కొన్ని ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • ఔట్ డేట్ నరేషన్

విశ్లేషణ:

ఒక ఫార్ములా ప్రకారం నడిచే గల్లీ రౌడీ విషయంలో టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. ఎగ్జిక్యూషన్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సందీప్ కిషన్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేసినా కానీ క్యారెక్టర్లను పైపైన నడిపించేసిన విధానం, సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేయదు. ఆ విషయంలో సినిమా నిరుత్సాహపరుస్తుంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వస్తోన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక...

బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే

బిగ్ బాస్ సీజన్ 5 లో ఆరు వారాలు ముగిసాయి. ఈరోజు నుండి ఏడో వారంలోకి ఎంటర్ అవుతోంది. ప్రతీ సోమవారం నామినేషన్స్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంటాయి. ప్రేక్షకులకు కూడా ఎవరు నామినేట్...

‘రాజ్ కుంద్రా బెదిరించారు.. ఆయనకు మాఫియా ఉంది’.. హీరోయిన్ ఆరోపణలు

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాపై హీరోయిన్ షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే.. తమ నుంచి డబ్బు తీసుకుని పలువురు రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టి కూడా మోసం చేశారని ఆరోపణలు...

అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ రివ్యూ

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా ఈయనకు హిట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ...

ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఎన్‌ సీ బీ అధికారులు ఆర్యన్ ను ఆరెస్ట్‌ చేయడంతో బాలీవుడ్ లో గత కొన్ని...