ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ ఏడాది చివరి వరకు పుష్ప ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో దర్శకుడు సుకుమార్ ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్‌ను రాశాడట. వెబ్ సిరీస్‌కు పరిమితులు ఉండవు కనుక చాలా విభిన్నమైన స్క్రిప్ట్‌ను సుకుమార్ రెడీ చేశాడంటూ ఆయన శిష్యుల ద్వారా అనధికారికంగా తెలుస్తోంది.
తన చుట్టు గతంలో జరిగిన 9 ప్రేమ కథలను సుకుమార్ కథా వస్తువుగా తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. 9 ప్రేమ కథలు కూడా పూర్తి విరుద్దంగా ఉండి చిన్న పాయింట్ తో కలిసేలా సుకుమార్ ప్లాన్ చేశాడట. ఈ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను తన ముగ్గురు శిష్యులకు అప్పగించి తాను దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడట. ప్రముఖ ఓటీటీతో ఇప్పటికే ఒప్పందం కూడా అయ్యిందని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ అంతా ఓటీటీ కంటెంట్ దారి పడుతున్న ఈ సమయంలో సుకుమార్ కూడా వెబ్ సిరీస్ ను తన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ లో నిర్మించేందుకు ఆసక్తి చూపించాడు. కేవలం ఈ 9 వ్ స్టోరీల వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా తన శిష్యుల దర్శకత్వంలో మరికొన్ని వెబ్ సిరీస్ లను కూడా భవిష్యత్తులో సుకుమార్ తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
241741 11043I see something genuinely special in this site . 543867
647508 503586Wonderful post man, keep the nice work, just shared this with my friendz 158430