నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో జ్ఞాపకం పోగొట్టుకున్న పోలీస్ అధికారిగా కనిపిస్తాడు సుధీర్ బాబు. ఈ చిత్రంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న సుధీర్ బాబుతో చిట్ చాట్.
హంట్ అంటున్నారు! ఎవరిని?
అది సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా అంతటా ఈ సస్పెన్స్ ఉంటుంది. ప్రతీ పాత్రపై అనుమానం కలుగుతుంది.
శ్రీకాంత్, భరత్ లను తీసుకోవాలన్న ఐడియా ఎవరిది?
నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. పూర్తిగా దర్శకుడు మహేష్ ఛాయస్ అది. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు కానీ ఉన్నంతసేపూ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. భరత్ కు ఇందులో రెండు, మూడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. భరత్ తో నా కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని తీసుకున్నాం.
ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసే ఆలోచన ఉందా?
సినిమా ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాం. చిత్రం విడుదలయ్యాక ఓ నిర్ణయం తీసుకుంటాం.
మేకింగ్ వీడియోలలో చాలా కష్టపడ్డారు. అంత రిస్క్ అవసరమా?
ఈ సినిమాలోని యాక్షన్ రియల్ గా ఉండాలని జాన్ విక్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నాం. జాగ్రత్తలు తీసుకున్నాం. నాకు రోప్స్ ఉంటేనే రిస్క్ అనిపిస్తుంది. లేకపోతేనే ఏం చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది.
ప్రోమోస్ లో యాక్షన్ ఎక్కువ హైలైట్ అవుతోంది?
యాక్షన్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఈ సినిమా కోర్ పాయింట్ యాక్షన్ కాదు ఎమోషన్. సినిమాలో ప్రేమకథ లేకపోయినా స్నేహం మీద చాలా ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడే అన్నీ చెప్పలేను.
ఫారిన్ నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తెప్పించడానికి కారణం?
స్టెంట్స్ పరంగా కొత్తగా ప్రయత్నించాం. అందుకోసమే ఫారిన్ కొరియోగ్రాఫర్స్ అయితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళను నేను కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను. వాళ్ళు సినిమాలకు పనిచేస్తారని తర్వాత తెలిసింది. ఉన్న నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లు నాలుగు రోజుల్లో పూర్తి చేసాం. సినిమా చూసాక ఇది చెబితే ఎవరూ నమ్మరు.
హంట్ లో యాక్షన్ డిఫెరెంట్ అంటున్నారు. ఇంకా ఏదైనా?
సినిమా మొత్తం డిఫెరెంట్ అటెంప్ట్. నాకు తెలిసి ఏ హీరో ఇలాంటి సినిమా అటెంప్ట్ చేయరు. నేను ఈ రిస్క్ చేయడం జనాలు యాక్సప్ట్ చేస్తారా లేదా అని చూడాలని ఉంది. సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఫలితంపై చాలా ప్రభావాలు ఉంటాయి.
కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమా చేసానని అన్నారు??
కృష్ణగారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. ఆయన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసారు. ఈ చిత్రాన్ని ఆయనకు చూపించాలని అనుకున్నా. ఆయన హంట్ చూసి ఉంటే కచ్చితంగా మెచ్చుకుని ఉండేవారు. ఆయన మన మధ్య లేకపోవడం వెలితిగా ఉంది.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…
హర్షవర్ధన్ దర్శకత్వంలో మాయ మశ్చీంద్ర చేస్తున్నా. అందులో ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాను. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇంకో సినిమా ఉంది.