‘తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ, 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయని స్థానాల్లో జనసేన సత్తా చాటాలి. మన భావజాలానికి దగ్గరగా ఇక్కడ ఎవరు పొత్తుకు వచ్చినా సంతోషమే. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు వదిలేసినట్టు వదల’మని పవన్ కల్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో జనసేన తెలంగాణ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
‘ఇక్కడ మైనింగ్ మాఫియా నడుస్తోంది. చిన్న పోలిస్ ఉద్యోగానికి ఇన్ని పరీక్షలా..? మరి ప్రజాప్రతినిధులకు ఎన్ని పరిక్షలు ఉండాలి..? తెలంగాణలో ఖచ్చితంగా పర్యటిస్తా. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో లేను. వారి నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నా. తెలంగాణ, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. అక్కడ కులల మధ్య రాజకీయం చేయాలి. వాళ్లు మామూలోళ్లు కాదు. సొంత బాబాయిని చంపించుకుంటారు. న్యాయ వ్యవస్థను తూలనాడతారు. పోలీసులను ఇష్టారాజ్యంగా వాడేస్తారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు. అటువంటి నాయకత్వం తెలంగాణలో లేద’ని పవన్ కల్యాణ్ అన్నారు.