Spy Movie Review: స్పై మూవీ రివ్యూ

Critic Rating
( 2.20 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow
Movie స్పై
Star Cast నిఖిల్ సిద్ధార్థ, ఈశ్వర్యా మీనన్
Director గ్యారీ BH
Producer చరణ్ తేజ్ ఉప్పలపాటి
Music విశాల్ చంద్రశేఖర్
Run Time 2గం 15ని
Release 29 జూన్, 2023

Spy Movie Review: కార్తికేయ 2 తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న నిఖిల్, ఈసారి స్పై తో మన ముందుకు రానున్నాడు. ఈ స్పై చిత్రంపై నిఖిల్ మంచి అంచనాలే పెట్టుకున్నాడు కూడా. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.

కథ:

శ్రీలంకలో పని చేసే ఒక రా ఏజెంట్ జై (నిఖిల్). ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక ఉగ్రవాది పంపిన వీడియో కారణంగా జై కి తన ఆచూకీ కనుక్కోవాల్సిన అవసరం పడుతుంది. అయితే ఇదే ఉగ్రవాది కారణంగా తన జీవితంలో పెద్ద విషాదం జరిగిందని కూడా తెలుసుకుంటాడు.

ఇక ఈ మిషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఎలా లింక్ అయింది? దాని తర్వాత ఏం జరిగింది అన్నది ప్రధాన కథాంశం.

నటీనటులు:

ఒక స్పై పాత్రలో నిఖిల్ చక్కగా ఒదిగిపోయాడు. అయితే ఈ రోల్ లో పెద్దగా ఛాలెంజింగ్ అంశాలు కూడా పెద్దగా లేవు. అయినా కానీ నిఖిల్ బాగా చేసాడనే చెప్పాలి. ఐశ్వర్య మీనన్ కు దక్కిన చిన్న పాత్రలోనే మెప్పించింది. కమెడియన్ అభినవ్ గోమఠం పూర్తి నిడివి ఉన్న పాత్ర దక్కింది. తను బాగానే చేసాడు. ఆర్యన్ రాజేష్, మకరంద్ దేష్పాండే తదితరులు చిత్రానికి అవసరమైన రీతిలో నటించారు.

సాంకేతిక నిపుణులు:

ఎడిటర్ గా ప్రతిభ నిరూపించుకున్న గ్యారీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే పేరుకే స్పై థ్రిల్లర్ అయినా ఇందులో పెద్దగా ట్విస్టులేం ఉండవు. కథాకథనాలు మనం ఊహించినట్లుగానే జరుగుతాయి. చిత్ర ఫస్ట్ హాఫ్ డీసెంట్ నోట్ లో సాగిపోతుంది. అయితే సెకండ్ హాఫ్ విషయంలోనే సమస్య అంతా ఉంది. అసలు నేతాజీ ట్రాక్ ఈ చిత్ర మెయిన్ ప్లాట్ లో సరిగ్గా ఇమడలేదు అనిపిస్తుంది.

స్క్రీన్ ప్లే లోని లోపాల కారణంగా చిత్ర నిడివి తక్కువే ఉన్నా కానీ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఇక చిత్రంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో మైనస్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నిఖిల్
  • విజువల్స్

మైనస్ పాయింట్స్:

  • ఊహించదగ్గ నరేషన్
  • నేతాజీ ట్రాక్
  • థ్రిల్స్ లేకపోవడం

విశ్లేషణ:

బిలో యావరేజ్ గా అనిపించే స్పై లో పెద్దగా హై మూమెంట్స్ అంటూ లేవు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా మెయిన్ కంప్లైంట్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది. నిఖిల్ బాగానే కష్టపడ్డప్పటికీ స్పై థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో బిలో యావరేజ్ గా అనిపించొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

సినిమా

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత...

రాజకీయం

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

ఎక్కువ చదివినవి

షూటింగ్ స్పాట్‌లో నయనతార ప్రత్యేక సౌకర్యాలు.. క్యారవాన్‌ డిమాండ్స్‌పై హాట్ టాక్

సౌత్ ఇండియా అంతటా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నయనతార షూటింగ్ స్పాట్‌లో కోరుకునే సౌకర్యాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రతి సినిమా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో తనకు అవసరమైన సౌకర్యాలను...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...

Daily Horoscope: ఉద్యోగ అవకాశాలు – సింహానికి శుభవార్త, ధనుస్సుకు ఆర్థిక లాభ సూచనలు

ఫిబ్రవరి 28, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మీపై వస్తాయి. సహచరుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో శాంతంగా ఉండాలి. ఖర్చుల...

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...