RRR: ఆర్ఆర్ఆర్ (RRR) తో వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్ తో చిత్ర యూనిట్ ఇంకా తడిసిముద్దవుతూనే ఉంది. ఇప్పుడు వీరికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆస్కార్ (Oscar) కమిటీలో చోటు దక్కింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ 2023కు సంబంధించిన కొత్తగా ప్రకటించిన ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు స్థానం లభించింది. మొత్తం ఎంపికైన 398లో ‘ఆర్ఆర్ఆర్’కు చెందిన వారు 6గురు ఉండటం విశేషం. వీరిలో మన స్టార్ హీరోలు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Ntr) తోపాటు కీరవాణి, చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఉన్నారు.
దీంతో వీరందరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వీరిలో రాజమౌళి లేకపోవడంపై కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరుగబోతోంది. వీరితోపాటు దర్శకులు మణిరత్నం, కరణ్ జోహార్ ను కూడా కమిటీ ఆహ్వానించింది.