Switch to English

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి. రెండేళ్లపాటు ప్రభుత్వ ప్రకటనలను నిషేధించాలని, కరోనా నియంత్రణకు అవసరమైన యాడ్స్ మినహా మిగిలిన అన్ని రకాల యాడ్స్ ఇవ్వడం మానేయాలని ఆమె సూచించడమే ఇందుకు కారణం.

ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రకటన కోసం రూ.1250 కోట్లు వెచ్చిస్తోంది. రెండేళ్లపాటు వాటిని నిలిపివేస్తే రూ.2500 కోట్లు ఆదా అవుతాయి. అయితే, ఈ యాడ్స్ మీద పలు చిన్నపత్రికలతోపాటు ప్రధాన మీడియా సంస్థలు ఆదాయం పొందుతున్నాయి. సోనియా సూచనను ప్రధాని మోదీ పాటిస్తే మీడియాకు సంకటస్థితి తప్పదు. నిజానికి కరోనా కారణంగా కుదేలైన రంగాల్లో మీడియా కూడా ఉంది.

లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడటంతో మీడియాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య ప్రకటనలు రావడంలేదు. పత్రికల ద్వారా కరోనా వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేకపోయినా జనం పత్రికలు ముట్టుకోవడానికి భయడుతున్నారు. దీంతో ప్రధాన పత్రికల సర్క్యులేషన్ తగ్గింది. పైగా లాక్ డౌన్ మొదలైన తర్వాత ఒక్క యాడ్ కూడా కనిపించడంలేదు. ఫలితంగా అటు కవర్ ప్రైస్ ఆదాయమూ రావడంలేదు. ఇటు ప్రకటనల పైకమూ రావడంలేదు. దీంతో పేజీల సంఖ్యను కుదించి నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకుంటున్నాయి.

కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు సిబ్బంది తగ్గింపుపైనా దృష్టి పెట్టాయి. ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించే ఓ మీడియా ఛానల్ లో తాజాగా కొంతమందిని ఇక రావొద్దని చెప్పినట్టు సమాచారం.

ఈనెల జీతం మే 1న చెల్లిస్తామని చెప్పి సాగనంపినట్టు తెలుస్తోంది. వీరిలో కెమెరామేన్లు, తక్కువ వేతనం పొందే సిబ్బంది కూడా ఉన్నట్టు చెబుతున్నారు. భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా యాడ్స్ నిలిచిపోతే మీడియా రంగం మరింద గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

5 COMMENTS

  1. 304767 22660Can I just say what a relief to search out somebody who really is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a problem to light and make it essential. Extra folks need to have to learn this and perceive this facet with the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 678755

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...