చిరంజీవి నిన్న ఏప్రిల్ 8వ తారీకుతో నాకు ప్రత్యేకమైన సంబంధం, అనుబంధం ఉంది అదేంటో రేపు చెప్తాను అంటూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. దాంతో నిన్నంతా కూడా పలు రకాలుగా ఎవరికి తోచిన విధంగా వారు ఊహించారు. ఎక్కువ శాతం అల్లు అర్జున్ బర్త్‌డే అవ్వడం వల్ల ఏప్రిల్ 8వ తారీకు చిరంజీవికి ఆయన భార్యకు ప్రత్యేకం అయ్యి ఉంటుందని అనుకున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది నేడు క్లారిటీ ఇచ్చాడు. నేడు హనుమజ్జయంతి కారణంగా నేడు నాకు ప్రత్యేకం అన్నట్లుగా చిరు ట్వీట్స్ చేశారు.
ఆంజనేయ స్వామితో తనకున్న అనుబంధం, ఆయనపై తనకున్న భక్తిని చిరంజీవి వరుస ట్వీట్స్‌తో తెలియజేశాడు. చిన్న తనంలో నాకు ఒక లాటరీలో ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చింది. ఆ బొమ్మను తీసుకువెళ్లి నాన్నకు చూపిస్తే ఆ బొమ్మను చూసి కనుబొమ్మలు, కళ్లు, ముక్కు నీది ఉన్నట్లుగానే ఉంది కదా అన్నాడు. ఆ ఫొటో ఇప్పటికి నా వద్దే ఉంది అన్నాడు. ఇక కొన్ని సంవత్సరాల క్రితం బాబు గారు నాకు ఇంట్లో పెట్టుకునేందుకు ఒక ఆంజనేయ స్వామి బొమ్మ వేసిస్తాను అన్నాడు.
ఆయన నా కోసం వేసిచ్చిన ఆంజనేయ స్వామి బొమ్మను నేను పాలరాతి పై రీ క్రియేట్ చేయించాను. అది ఇప్పుడు మా పూజగదిలో ఉంది. ఆ బొమ్మ నాకు బాపు గారు ఇచ్చే సమయంలో ఏంటోండి బొమ్మ వేస్తున్న సమయంలో మీ పోలికలే వచ్చాయి. కను బొమ్మలు, కళ్లు మీ లాగే ఉన్నాయి. అయినా సరే అని అలాగే ఉంచాను అంటూ బొమ్మ ఇచ్చాడు అంటూ తనకు ఈ రోజుతో ఆంజనేయ స్వామితో ఉన్న అనుబంధంను నెమరవేసుకున్నాడు.
ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాకు ఇంకా అల్లు అర్జున్, అఖిల్‌లకు కూడా తనదైన శైలిలో బర్త్‌డే విషెష్‌ను చిరంజీవి చెప్పాడు. వారిని మనసారా ఆశీర్వదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ కోరుకున్నాడు.
ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?…to be continued pic.twitter.com/TdVKjg05nS
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది…#8thApril …to be continued. pic.twitter.com/m3J6S1ZEMs
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
456729 426023New York Travel Tips […]below you will discover the link to some websites that we think you should visit[…] 517703
877533 132554Wow What excellent information. Thank you for the time you spent on this post. 791427