Switch to English

Skanda స్కంద మూవీ రివ్యూ – మాస్ ప్రేక్షకులకు నచ్చవచ్చు

Critic Rating
( 2.25 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,708FansLike
57,764FollowersFollow
Movie స్కందా
Star Cast రామ్ పొత్తినేని, శ్రీలీలా
Director బోయపాటి శ్రీను
Producer శ్రీనివాస చిత్తూరి, పవన్ కుమార్
Music తమన్
Run Time 2 గం 47 ని
Release 28 సెప్టెంబర్ 2023

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఊర మాస్ చిత్రం స్కంద. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరి అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతుర్ని తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు కిడ్నప్ చేస్తాడు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి ఒక యుద్దానికి తెరతీస్తాడు. ఈ మధ్యలోకి రామ్ ఎలా వచ్చాడు, ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి? ఇందులో శ్రీలీల పాత్ర ఏమిటి? అన్నవి తెర మీదనే చూడాలి.

నటీనటులు:

ఇస్మార్ట్ శంకర్ దగ్గరనుండి రామ్ పోతినేని మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకు తగ్గ దర్శకుడు బోయపాటి శ్రీనుని ఎంచుకున్నాడు. రామ్ ఇందులో కేవలం మాస్ గానే కాదు ఊరమాస్ అవతారంలో కనిపించాడు. ఈ లుక్ తనకు సెట్ అయింది. రగ్గడ్ రోల్ లో రామ్ పెర్ఫార్మన్స్ డీసెంట్ గా సాగింది.

శ్రీలీల చూడటానికి చాలా బాగుంది. తనకున్న ఇమేజ్ కు తగ్గట్లుగానే డ్యాన్స్ లలో ఇరగదీసింది. గ్లామరస్ గానూ కనిపించింది. మరోసారి శ్రీకాంత్ కు ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు బోయపాటి శ్రీను. తనవంతుగా న్యాయం చేసాడు. తమిళ నటుడు రాజా ఈ చిత్రంలో రామ్ తండ్రి పాత్రలో కనిపించాడు. మిగతావాళ్ళు మాములే.

సాంకేతిక నిపుణులు:

బోయపాటి శ్రీను తను నమ్ముకున్న ఫార్ములాకే మరోసారి కట్టుబడ్డాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్, యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయ్. కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ ఓవర్ ది బోర్డ్ వెళ్లాయి కూడా. ఇక క్లైమాక్స్ కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. యాక్షన్ మీద పెట్టిన శ్రద్ధ ఎమోషన్స్ మీద పెట్టలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కంప్లీట్ మాస్ ఫీస్ట్ లా ఉంది.

థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ లౌడ్ గా సాగింది. అఖండకు మించిన రేంజ్ సౌండ్స్ తో మోతమోగించాడు. పాటలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ నీట్ గా సాగింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండవచ్చు. ఫస్ట్, సెకండ్ హాఫ్ లలో పలు ల్యాగ్ సీన్లు ఈజీగా తొలగించవచ్చు. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • రామ్ మాస్ మేకోవర్
  • కొన్ని మాస్ మూమెంట్స్

మైనస్ పాయింట్స్:

  • ఓవర్ ది టాప్, సాగదీసిన యాక్షన్ ఎపిసోడ్స్
  • రొటీన్ నరేషన్
  • క్లైమాక్స్
  • సాంగ్స్

విశ్లేషణ:

అక్కడక్కడా మాస్ ప్రేక్షకులను మెప్పించే మూమెంట్స్ ను విజయవంతంగా జొప్పించిన బోయపాటి శ్రీను మిగతా పార్ట్ ను గాలికి వదిలేసాడు అనిపిస్తుంది. మాస్ మూవీ లవర్స్ కు అయితే ఒకసారి నచ్చే అవకాశాలున్న ఈ చిత్రం మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి...

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం...

Nayanthara: నన్ను అలా పిలుస్తుంటే తిట్టినట్టు ఉంటుంది: నయనతార

Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నచ్చదని అగ్ర నటి నయనతార (Nayanthara) అన్నారు. ఇటివల తాను ప్రధాన పాత్రలో నటించగా డిసెంబర్...

Ram Charan: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్

Ram Charan: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సోషల్ మీడియా వేదికగా...

రాజకీయం

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

TS Ministers: తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణ పద్ధతి వేరు.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు.!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు...

సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారా.?

అధికారంలోకి వచ్చక గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనేది ఎవరైనా చేసే పనే. కాకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారట. కేసీయార్ హయాంలో జరిగిన అప్పులు సహా,...

ఎక్కువ చదివినవి

హై నాన్న… వీళిద్దరి పాత్రలూ కీలకమేనట!

న్యాచురల్ స్టార్ నాని నటించిన హై నాన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక కీలకమైన కూతురి...

Ram Charan: చాముండేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నారు. సినిమా మైసూరు షెడ్యూల్లో పాల్గొన్న రామ్ చరణ్...

Dunki Trailer: ‘డంకీ డ్రాప్ 4’ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. మంగళవారం ఈ సినిమా నుంచి ‘డంకీ డ్రాప్ 4’గా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది...

Pallavi Prashanth : బిగ్‌బాస్‌ : రైతు బిడ్డకి సినిమా ఆఫర్లు

Pallavi Prashanth : తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 లో స్పెషల్‌ కంటెస్టెంట్‌ గా అడుగు పెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. అతడు రెండు మూడు...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే పోల్చాలేమో.! అయినా, అవేం ఆటలు.. పిచ్చి...