పీఆర్సీపై ఓవైపు ఉద్యోగులు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పే స్కేల్స్ తో జీతాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు డ్రాయింగ్ డిస్బర్స్ మెంట్, ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులను ఆదేశిస్తూ.. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ను అనుసరించి బిల్లులు చెల్లించాలని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త పీఆర్సీ ప్రకారం 2018 జూలై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ సర్వీస్ లెక్కించి జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు కొత్త సాఫ్ట్ వేర్ మాడ్యూల్ లో బిల్లులు అప్లోడ్ చేయాలిన కూడా సూచించింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రెజరీ ఉద్యోగులు సైతం తాము ఉద్యోగ సంఘాల బాటే పడతామని గతంలోనే తెలిపారు కూడా.