యంగ్ హీరో నితిన్ సరసన సాయి పల్లవి నటించనుందా? ప్రస్తుతం ఈ వార్త హల్చల్ చేస్తోంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా సాయి పల్లవి బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న సాయి పల్లవి కెరీర్ లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం సాయి పల్లవి రెండు సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. నాగ చైతన్యతో చేసిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల అవుతోంది. ఇక ఏప్రిల్ 30న రానా దగ్గుబాటి నటించిన విరాటపర్వం విడుదలవుతోంది.
న్యాచురల్ స్టార్ నాని సరసన మరోసారి శ్యామ్ సింగ రాయ్ లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే నితిన్ తర్వాతి సినిమాకు సాయి పల్లవిని హీరోయిన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతం మాస్ట్రో సినిమాలో నటిస్తోన్న నితిన్, తర్వాత వక్కంతం వంశీ సినిమాకు ఓకే చెప్పాడు. మరి సాయి పల్లవి ఈ సినిమాలో నటించడానికి ఎస్ అంటుందో లేదో చూడాలి.