యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ నుండి విడుదలైన తర్వాత ఈ సినిమా చేస్తాడని అన్నారు. చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే కనిపిస్తోందని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.
ఈ ప్రాజెక్టుపై మొదటి నుండి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మంత్రిగారి వియ్యంకుడు టైపులో ఒక పొలిటికల్ టచ్ ఉన్న స్క్రిప్ట్ ను సిద్ధం చేసి తీసుకొచ్చాడట. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో తాను పాలిటిక్స్ వైపు వెళ్లే ఆలోచన లేదని, ఆ టైప్ స్క్రిప్ట్ చేస్తే అభిమానుల్లో లేనిపోని ఊహాగానాలు వస్తాయని ఎన్టీఆర్ భావించాడు.
దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా అది కూడా నచ్చలేదు. దీంతో మార్పులు చేర్పులు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
101795 964394You got a very good internet site, Gladiolus I found it by means of yahoo. 26124
697475 627042Oh my goodness! a wonderful post dude. Thanks Even so My business is experiencing concern with ur rss . Do not know why Struggling to join it. Is there anybody getting identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 435053