Switch to English

నితిన్ ‘రంగ్ దే’ మూవీ రివ్యూ – పాత కథకి సరిగ్గా అద్దని కొత్త రంగులు.!

Critic Rating
( 2.75 )
User Rating
( 4.80 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow
Movie రంగ్ దే
Star Cast నితిన్, కీర్తి సురేష్
Director వెంకీ అట్లూరి
Producer నాగ వంశీ
Music దేవీశ్రీ ప్రసాద్
Run Time 2 గంటల 10 నిముషాలు
Release మార్చ్ 26, 2021

యంగ్ హీరో నితిన్ – లేడీ సూపర్ స్టార్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. రంగ్ దే సినిమాతో మళ్ళీ పక్కా హిట్ కొడతానని చెప్పిన నితిన్ స్టేట్మెంట్ ని నిజం చేసేలా ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

చిన్నతనంలో అర్జున్(నితిన్) నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకొగానే అను(కీర్తి సురేష్) రూపంలో పక్కింట్లోకి వస్తుంది. కానీ అర్జున్ ని తొక్కడం స్టార్ట్ చేయగానే వచ్చింది గర్ల్ ఫ్రెండ్ కాదని తన పాలిట రాక్షసి అని అర్థమవుతుంది. ఇక చిన్నప్పటి నుంచీ పెద్దయ్యే వరకూ ఇద్దరి మధ్యా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అర్జున్ – అనులకి అస్సలు పడదు. కానీ అను చేసిన ఓ డేరింగ్ స్టెప్ వలన తప్పనిసరి పరిస్థితుల్లో అర్జున్ అనుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలా అనుని పెళ్లి చేసుకున్న అర్జున్ పెళ్లి తర్వాత పేస్ చేసిన ప్రాబ్లెమ్స్ ఏమిటి? పెళ్లయ్యాక కూడా వాళ్ళు అలానే శత్రువుల్లా కొట్టుకుంటూనే ఉన్నారా? లేక వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఒకవేళ ప్రేమలో పడితే, దానికి కారణం ఏంటి? అసలు అర్జున్ ఎందుకు అనుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేదే కథ.

తెరమీద స్టార్స్..

నితిన్ లుక్స్ పరంగా స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. అర్జున్ పాత్రలో నితిన్ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్ తో, అమాయకపు ఎక్స్ ప్రెషన్స్ తో ట్రై చేసిన వన్ లైనర్స్ బాగున్నాయి. అలాగే సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో తన వరకూ బాగా నటించాడు. కీర్తి సురేష్ మొదటి సారి ఆటపట్టించే అల్లరి పిల్లగా కనిపించి ఆకట్టుకోవడమే కాకుండా తను స్ట్రాంగ్ అయిన ఎమోషనల్ సీన్స్ లో మరోసారి మెప్పించింది. ఇకపోతే సీనియర్ నరేష్ నితిన్ ఫాదర్ పాత్రలో నవ్విస్తాడు. ముఖ్యంగా నితిన్ – నరేష్ మధ్య సీన్స్ లోని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. సుహాస్, అభినవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీలు తమ పాత్రల్లో అక్కడక్కడా నవ్వించారు. కీర్తి మదర్ పాత్రలో రోహిణి ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకుంది.

తెర వెనుక టాలెంట్..

ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకి విజువల్స్ మరియు మ్యూజిక్ ప్రాణం అని చెప్పచ్చు. ఆ విషయంలో పిసి శ్రీరామ్ విజువల్స్ బాగున్నాయి అనిపిస్తాయి కానీ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ విషయానికి వస్తే సెకండాఫ్ లో వచ్చే సాంగ్స్(బస్టాండే బస్టాండే, నీ కనులు ఎపుడు) బాగుంటే, మిగిలిన పాటలు పెద్దగా అనిపించవు. అలాగే నేపధ్య సంగీతం కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఎడిటర్ నవీన్ నూలి వీలైనంత షార్ప్ గా కట్ చేయడం రన్ టైం పరంగా కొంత ప్లస్ అని చెప్పాలి. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ కూడా చాలా క్లాసీగా ఉంది.

ఇక కెప్టెన్ అయిన వెంకీ అట్లూరి చాలా సింపుల్ పాయింట్ ని ఎమోషనల్ రైడ్ గా చెప్పాలనుకున్నాడు. అందుకోసం తను ఎంచుకున్న అర్జున్ – అను పాత్రలను బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ టామ్ & జెర్రీ స్టైల్లో కొట్టుకోవడం, తర్వాత ప్రేమలో పడడం అనే ఫార్మాట్ మనం చాలా సర్లే చూసేసాం. దాంతో స్టోరీ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ చాలా పాతదిగా అనిపిస్తుంది. దాని వల్ల కథనం ఊహాజనితంగా మారింది, ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఓకే, మిగతా అంతా బాగా బోర్ కొట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా నేరేషన్ చాలా స్లోగా ఉండడంతో పాటు ప్రతి సన్నివేశం సాగదీసినట్టు ఉండడం అనేది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉంది. ముఖ్యంగా సినిమాకి కీలకమైన హీరో – హీరోయిన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ కన్విన్సింగ్ గా లేకపోవడంతో అంతగా కనెక్ట్ అవ్వలేదు. డైలాగ్స్ పరంగా మాత్రం కొన్ని వన్ లైనర్స్ మరియు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నితిన్, కీర్తి సురేష్ ల పెర్ఫార్మన్స్
– అక్కడక్కడా నవ్వించే కామెడీ సీన్స్
– సెకండాఫ్ లో వచ్చే సాంగ్స్
– షార్ట్ రన్ టైం

బోరింగ్ మోమెంట్స్:

– కథ కోసం ఎంచుకున్న రొటీన్ బ్యాక్ డ్రాప్
– ఊహాజనిత కథనం
– స్లో నెరేషన్స్ తో సాగదీసే సీన్స్
– వీక్ ఎమోషనల్ కనెక్షన్
– మ్యూజిక్

విశ్లేషణ:

డైరెక్టర్ వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ మొదటి అర్ధ భాగం సరదా సరదాగా సాగిపోతే, సెకండాఫ్ అంతా ఎమోషనల్ గా ఉంటుందన్నారు. అన్న దాని ప్రకారం ఫస్ట్ హాఫ్ లో కొంత సరదా సన్నివేశాలతో గడిచిపోయినప్పటికీ, కంటెంట్ లేని కథకి స్లో నేరేషన్ తోడవ్వడం, కీలకమైన నితిన్ – కీర్తి సురేష్ లా ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం వలన చివరికి ఆడియన్స్ నిరుత్సాహపడతారు. జీవితంలోని అన్ని ఎమోషన్స్ ని కలర్ఫుల్ గా చూపిస్తుందని చెప్పుకున్న ఈ చిత్ర టీంకి, వారు కోరుకున్న సక్సెస్ ని ఇచ్చే కలర్ అయితే ‘రంగ్ దే’ కాదనే చెప్పాలి.

చూడాలా? వద్దా?: నాలుగు కామెడీ సీన్స్ తో రొటీన్ రోమ్-కామ్ ఫిలిమ్స్ ఇష్టపడే వారికి మాత్రమే.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.75/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: ‘చిరు’త వేగంతో వచ్చిన చిరు తనయుడు ‘రామ్ చరణ్’

Ram Charan: ఒక్కడిగా వచ్చి.. ఒక్కటి నుంచి మొదలెట్టి.. ఒక్కోటి సాధించుకుంటూ వెళ్లింది చిరంజీవి (Chiranjeevi). సాధించిన కీర్తి మెగాస్టార్ (Mega Star). ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసింది తనయుడు రామ్ చరణ్...

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు సిద్ధమైన ఫ్యాన్స్

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజులే గుర్తొస్తాయి. వెండితెరపైనే కాకుండా...

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

పిఠాపురంలో మిధున్ ‘రెడ్డి’కి ఏంటి పని.?

పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.. అని అధికార వైసీపీ అంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ గనకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సేఫ్ జోన్’గా భావించి,...