Switch to English

రవితేజ చేతుల మీదుగా ‘రూల్స్ రంజన్’ పాట విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.

‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం 10:20 గంటలకు విడుదలైంది. విడుదల సందర్భంగా పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించిన రవితేజ, చిత్రం ఘన విజయం సాధించాలని ఆకంక్షించారు. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఎవరి చేతనైనా కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. “నువ్ పక్కనుంటే చిల్లు, తిరగొద్దే వాచు ముల్లు.. నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్లు” అంటూ తేలికైన పదాలతో పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా రాశారు. ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్ తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ, నాయకానాయికలు వేసిన స్టెప్పులు అలరించాయి. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్ మీద ఫుల్ వీడియో సాంగ్ కి థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.

పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ వినోదాత్మక చిత్రం ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

ఎక్కువ చదివినవి

తలకాయ్.. మామిడికాయ్.! ఏదైనా సరే ‘వైసీపీ’ తొక్కుకుంటూ పోవడమే.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్యన సత్తెనపల్లి వెళ్ళారు. అక్కడ ఓ పెద్దాయనని వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. కారు కింద పడ్డాడు ఆ పెద్దాయన. కారు చక్రం కింద ఆ...

కిరణ్ అబ్బవరం స్వంత నిర్మాణంలో కొత్త సినిమా

షార్ట్ ఫిలింస్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు అదే దారిలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు చూసిన ఆయన, ఇప్పుడు తనలాంటి బ్యాక్‌గ్రౌండ్...

ఫలితమివ్వని తోతాపురి మామిడి రైతుల పరామర్శ

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం తోతాపురిలో నిర్వహించిన మామిడి రైతుల పరామర్శ  అస్తవ్యస్తంగా  సాగింది. వైఎస్‌ జగన్‌ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని ఏర్పాట్లు లీక్ కావడం, అవి అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోవటం...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్, లోకేష్ హెచ్చరిక

కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ వై.సి.పి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం లేపింది. ఈ వ్యాఖ్యలపై  పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ అంశంపై...