ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా గత కొంత కాలం నుండి షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎంతెంత హంగామా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఎవరూ ఊహించని విధంగా సడెన్ గా నిన్న అప్డేట్ ఇచ్చారు – ఉగాది రోజున ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల జరుగుతుందని. చెప్పినట్లుగానే కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టైటిల్ ను రౌద్రం రణం రుధిరం గా పేర్కొన్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ను అగ్నిగా చూపించిన రాజమౌళి, ఎన్టీఆర్ ను నేరుగా చూపించారు. రెండిటికీ భిన్నమైన స్వరూపాలు ఉంటాయి. రెండిటికీ రెండూ సమఉజ్జీలే. నీరుతో నిప్పును ఆపివేయవచ్చు. నిప్పుతో నీరుకు చెక్ పెట్టవచ్చు. అలాంటి ఈ రెండు స్వరూపాలు తలబడితే ఎలా ఉంటుంది అన్న సంకేతాన్ని మోషన్ పోస్టర్ లో ఇచ్చారు.
1920ల కాలంలో జరిగే కథగా ఆర్ ఆర్ ఆర్ ఉండబోతోంది. ఎం ఎం కీరవాణి ఈ మోషన్ పోస్టర్ కు ఇచ్చిన సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మోషన్ పోస్టర్ స్థాయిని మరింత పెంచేదిగానే ఉంది.
ఆర్ ఆర్ ఆర్ టీం ఈ చిత్రం జనవరి 8, 2021నే వస్తుందని మరోసారి ఈ మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేసారు.
330178 545080Woh I really like your posts , bookmarked ! My wife and i take problem along along with your last point. 264873
527722 587516Thanks for the weblog loaded with so several details. Stopping by your weblog helped me to get what I was searching for. 592253
987901 213237Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and website owners alike! 934875