Switch to English

మాయదారి మూషికాలు.. మందు కొట్టాయంట!

అసలే లాక్ డౌన్.. బోలెడంత ఖాళీ.. ఎంచక్కా రోజూ రెండు పెగ్గులేసి పడుకుందామంటే మందు దొరకడంలేదాయె. దీంతో పిచ్చిక్కిపోతున్న మందుబాబులు ఎందరో ఉన్నారు. ఇది నాణానికి ఒకవైపే. ఇక నాణానికి మరోవైపు చూద్దాం.. కావాల్సిన బ్రాండ్ ఎంత కావాలంటే అంత.. చక్కగా ఇంటికే వచ్చేస్తోంది. కాకపోతే కాస్త ఖర్చవుతుంది అంతే. కరోనా వంటి విపత్కర కాలంలో మందు కోసం ఆ మాత్రం మనీ వెచ్చించక తప్పదు కదా? లాక్ డౌన్ వేళ సరికొత్త మద్యం దందా ఇది. వైన్ షాపులకు వేసిన తాళాలు వేసినట్టే ఉంటున్నాయి. కానీ లోపల సీసాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ఇదే పరిస్థితి.

ఎక్సైజ్ అధికారులతో అవగాహన ఉంటే ఇవి బయటకు రావు. కానీ అందరు అధికారులు అలాగే ఉండరు కదా? అందుకే షాపులు తీయించి సరుకు లెక్క తేల్చాలని భావించారు. హైదరాబాద్ లోని ఓ మద్యం దుకాణం తెరచి చూసి లోపలకు వెళ్లిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లాక్ డౌన్ ప్రకటన నాటికి పూర్తి మద్యం సీసాలతో ఉన్న ఆ షాపులో ఒక్కటంటే ఒక్క సీసా కూడా కనిపించలేదు. దీంతో జరిగిందేమిటో అర్థం చేసుకుని ఆ దుకాణానికి సీలు వేశారు.

తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మద్యం దుకాణంలో లెక్కలో ఉన్న 78 సీసాలు మాయమయ్యాయి. అవి ఏమయ్యాయని ఎక్సైజ్ అధికారులు అడగ్గా.. సిబ్బంది తడుముకోకుండా ఎలుకలు తాగేశాయని సమాధానం ఇచ్చారు. అలా తాము అక్రమంగా అధిక ధరలకు అమ్మేసిన సీసాలను ఎలుకల ఖాతాలో వేసేశారు. విచిత్రంగా ఎక్సైజ్ సీఐ కూడా అదే రాసుకున్నారు.

కాకపోతే తాగేశాయంటే నమ్మరని.. సీసాలను ఎలుకలు కొరికేయడంతో వాటిలోని మద్యం అంతా కారిపోయిందని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఆ ఖాళీ సీసాలు కూడా అక్కడ కనిపించలేదు. మాయదారి మూషికాలు గాజుసీసాలను కొరికి అందులో ఉన్న మద్యాన్ని తాగేశాయంట అని స్థానికులు సెటైర్లు వేసుకుంటున్నారు.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ముంబైలో కలకలం.. రెండు గంటల్లోనే 7 కరోనా మరణాలు

కేవలం రెండు గంటల్లో కరోనా సోకిన 7గురు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుగొలిపే ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. స్థానిక జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ దారుణం...

చైనాలో శతాబ్దాల నాటి సంప్రదాయానికి కరోనా చెక్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. మానవుల జీవన సరళిలో అనేక మార్పులు తెచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేసింది. భౌతికదూరం అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసింది. ప్రతి విషయంలోనూ పెను...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...

ఓటిటి రిలీజ్: జ్యోతిక ‘పొన్మగళ్ వందాల్’ తమిళ్ మూవీ రివ్యూ

నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ నిర్మాత: సూర్య దర్శకత్వం: జేజే ఫెడ్రిక్ రన్ టైం: 2 గంటల 3 నిముషాలు విడుదల తేదీ: మే 29, 2020 ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ తమిళ నటి జ్యోతిక నటించిన కొత్త...