బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ యానిమల్ చిత్రంతో భీభత్సమైన హిట్ సాధించాడు. ఈ చిత్రం ఏకంగా 800 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇంకా స్ట్రాంగ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక క్రిస్మస్ కు డంకి, సలార్ విడుదలవుతున్నాయి కాబట్టి యానిమల్ నెమ్మదించే అవకాశముంటుంది.
రన్బీర్ కపూర్ కు యానిమల్ తో తెలుగులో కూడా భీభత్సమైన విజయం సొంతమైంది. ఈ చిత్రం ఏకంగా తెలుగు నుండే 35 నుండి 40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యానిమల్ తెలుగు, హిందీ వెర్షన్స్ చూసుకుంటే 75 కోట్ల నెట్ వసూలు చేసింది.
బ్రహ్మాస్త్ర, యానిమల్ చిత్రం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రన్బీర్ కు బాగానే మార్కెట్ ఏర్పడినట్లే. వరసగా రెండు హిట్స్ తర్వాత రన్బీర్ కపూర్ ఇక తెలుగు మార్కెట్ పై పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.