Niharika: మెగా (Mega) ఫ్యామిలీ నుంచి ఎందరో నటులు సినీ పరిశ్రమలోకి వచ్చారు. వారిలో ఒకరు కొణిదెల నిహారిక (Niharika). నాగబాబు (Nagababu) ముద్దుల తనయ.. వరుణ్ తేజ్ (Varun Tej) సోదరి. సినిమాల్లో తనకంటూ ఓ స్థానం పొందేందుకు పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గానూ మెప్పించింది. సూర్యకాంతం, సైరా తదితర సినిమాల్లో నటించింది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. అనంతరం సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది నిహారిక. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం మంచు మనోజ్ నటిస్తున్న ‘వాట్ ది ఫిష్’ అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ‘మనం మనం బరంపురం’ అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అష్టలక్ష్మి అనే పాత్రలో నటిస్తోంది. ధనవంతురాలైన అమ్మాయిగా సినిమాలో కనిపిస్తోంది. డిసెంబర్ 18 నిహారిక పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఆమధ్య షూటింగ్ ప్రారంభమైన సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.